AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iceland: అక్కడ మరోసారి బద్దలైన అగ్నిపర్వతం.. లావా దృశ్యాలు అద్భుతం..

రేక్జాన్స్ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం దాదాపు 8వందల ఏళ్లుగా ఈ వొల్కనో విస్పోటనం చెందకుండా నిశ్శబ్దంగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో తొలిసారి బద్ధలైన అగ్నిపర్వతం.. ఇప్పటివరకు 7సార్లు విస్ఫోటనం చెందినట్టుగా అధికారులు వెల్లడించారు.

Iceland: అక్కడ మరోసారి బద్దలైన అగ్నిపర్వతం.. లావా దృశ్యాలు అద్భుతం..
Iceland Volcano
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2024 | 12:21 PM

Share

ఐస్‌ల్యాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. దక్షిణ ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్‌ ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.14 గంటలకు విస్ఫోటం సంభవించిందని సమాచారం. అగ్నిపర్వతం నుంచి భారీగా ఉబికి వస్తోన్న లావా ఓ చిన్నపాటి నదిలా ప్రవహిస్తోంది. ఇదంతా బ్లూ లగూన్ స్పా వైపుగా పారుతూ వెళ్తోంది. ఎరుపురంగులో ప్రత్యేక ఆకర్షణగా ప్రవహిస్తున్న లావా ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నట్టుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఐస్‌లాండ్‌కు పోటెత్తుతున్నారు.

అగ్నిపర్వత విస్పోటనంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర చీలికలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. అయితే గత ఆగస్ట్ లో సంభవించిన విస్ఫోటంతో పోలిస్తే ఇది చిన్నదేనని స్పష్టం చేశారు. విస్ఫోటంతో గ్రిండావిక్‌ సహా సమీప పట్టణాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఐస్‌లాండ్‌లోని రేక్‌జానెస్‌ ద్వీపకల్పంలో ఉన్న అగ్నిపర్వతం మీదుగా తమ విమానం వెళ్తుతుండగా ప్రయాణికులు లావా గడ్డలు, పొగను తమ కెమెరాల్లో బంధించారు. ఏడాదిలోపుగాఏ ఏడోసారి ఇక్కడ జరిగిన విస్పోటనంతో దిగువన ఉన్న ఐస్‌లాండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బ్లూ లగూన్‌ హోటల్‌ కార్‌ పార్కింగ్‌ లావాతో మునిగిపోయింది. హెటల్‌లోని అతిథులను సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో విమాన ప్రయాణానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

రేక్జాన్స్ ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతం దాదాపు 8వందల ఏళ్లుగా ఈ వొల్కనో విస్పోటనం చెందకుండా నిశ్శబ్దంగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో తొలిసారి బద్ధలైన అగ్నిపర్వతం.. ఇప్పటివరకు 7సార్లు విస్ఫోటనం చెందినట్టుగా అధికారులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..