ఇదేందయ్యా ఇది.. తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా కాల్చి నివాళి..

తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి, ఆ గంజాయి ఆకులతో సిగరెట్టు చేసుకుని తాగానని చెప్పడమే ఇక్కడ అందరినీ విస్తుపోయేలా చేసింది. అవును ఇదంతా,

ఇదేందయ్యా ఇది.. తండ్రి శవాన్ని కాల్చిన బూడిదపై గంజాయి మొక్క పెంచి.. సిగరెట్లుగా కాల్చి నివాళి..
Youtuber Reveals Smoking
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 22, 2024 | 12:13 PM

పుర్రెకో బుద్ది, జిహ్వాకో రుచి అంటారు.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లైకులు, ఫేమ్‌ కోసం చాలా మంది అలాంటి చిత్ర విచిత్రమైన పనులే చేస్తున్నారు. రాత్రి రాత్రే గొప్ప స్టార్‌ అయిపోవాలనే ఆరాటంతో కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. కొందరు ప్రాణాలను రిస్క్‌లో పెడుతూ భయంకరమైన స్టంట్స్‌ చేస్తుంటే, మరికొందరు ఎదుటి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు.. ఇంకొందరు అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంటారు.. ఇంకొందరు మనుషుల భావోద్వేగాలను కూడా వదలకుండా రీల్స్‌ పిచ్చితో రెచ్చిపోతుంటారు.. అలాంటి ఓ విపరీత ధోరణి కలిగి ఓ యూట్యూబర్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహిళలు గంజాయి కాల్చడం కొత్తేమీ కాదు. వింత మరీ కాదు. కానీ, తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి, ఆ గంజాయి ఆకులతో సిగరెట్టు చేసుకుని తాగానని చెప్పడమే ఇక్కడ అందరినీ విస్తుపోయేలా చేసింది. అవును ఇదంతా, అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ రోసన్నా పాన్సినో తన మాటల్లోనే చెప్పిన వాస్తవాలు.. ఆమె తన రాడిక్యులస్ పోడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్ సందర్భంగా దివంగత తండ్రికి ప్రత్యేక నివాళులర్పించింది .

వీడియో ఇక్కడ చూడండి..

39 ఏళ్ల ఇంటర్నెట్ స్టార్, 14.6 మిలియన్లకు పైగా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లతో దూసుకుపోతున్న యూట్యూబర్ రోసన్నా పాన్సినో తన తండ్రి చితభస్మం ఉపయోగించి పెరిగిన గంజాయితో చేసిన సిగరెట్‌ను కాల్చి తన తండ్రికి నివాళి అర్పించానని చెప్పారు. పోడ్‌కాస్ట్ ఎపిసోడ్, “స్మోకింగ్ మై డెడ్ డాడ్” పేరుతో నవంబర్ 17న ఈ వీడియో ప్రసారమైంది. లుకేమియాతో ఆరేళ్ల పోరాటం తర్వాత ఐదేళ్ల క్రితం తన తండ్రి చనిపోయాడని చెప్పింది. చనిపోయే ముందు తన తండ్రి అసాధారణమైన కోరిక ఇదేనని పాన్సినో పేర్కొంది. అతను తన బూడిదను గంజాయి మొక్కకు ఉపయోగించి పెంచమని కోరినట్టుగా చెప్పింది. తన తండ్రి కోరిక మేరకు తను ఇలా చేశానని రోసన్నా వెల్లడించింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే