KK Survey: మరోసారి కేకే సర్వే సంచలనం.. ఇంత కరెక్ట్‌గా ఎలా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి సీట్లను కైవసం చేసుకునేలా కనిపిస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లను సాధించాల్సి ఉంటుంది.

KK Survey: మరోసారి కేకే సర్వే సంచలనం.. ఇంత కరెక్ట్‌గా ఎలా
KK Survey
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2024 | 1:00 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లలో ఎన్డీఏ కూటమి దుమ్మరేపుతోంది. మహాయుతి కూటమి 215 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ కూటమి కేవలం 55 చోట్ల ముందంజలో ఉండగా.. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్‌ ఇచ్చిన చాలా సంస్థలు మహాయుతి విజయాన్నే అంచనా వేశాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఏకపక్ష విజయం వస్తుందని అంచనా వేసి.. సీట్ల సంఖ్యతో సహా పూర్తి కచ్చితత్వంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన కేకే సర్వే.. ఇటు మహారాష్ట్రకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 225 స్థానాలను గెలుస్తుందని కేకే సర్వే తెలిపింది. మహా వికాస్ అఘాడీ కూటమికి 56 సీట్లు.. ఇతరులకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాకు తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహాయుతి కుటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ 56 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కానీ ఇతరులు మాత్రం 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఫలితాలకు చాలా క్లోజ్‌గా కేకే సర్వే అంచనాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే