Kundarki By Election: 11 మంది ముస్లింలతో.. ఏకైక హిందూ అభ్యర్థి పోటీ.. గెలిచింది ఎవరో తెలుసా..?

కుంద‌ర్కి ఉప ఎన్నిక‌లో 11 మంది ముస్లిం అభ్యర్థుల‌లో బీజేపీ తరుఫున ఒక్కడే హిందూ అభ్యర్థిని నిల‌బెట్టింది. అదే సమయంలో, ఎస్పీ తన అభ్యర్థిగా సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన హాజీ మహ్మద్ రిజ్వాన్‌కు బరిలోకి దింపింది

Kundarki By Election: 11 మంది ముస్లింలతో.. ఏకైక హిందూ అభ్యర్థి పోటీ.. గెలిచింది ఎవరో తెలుసా..?
Ramveer Thakur Vs Haji Mohd Rizwan
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2024 | 1:17 PM

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌ జిల్లా కుందార్కి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ముస్లింల ప్రాబల్యం ఉన్న కుందర్కిలో ఏకైక హిందూ అభ్యర్థి భారీ ఆధిక్యం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాంవీర్ ఠాకూర్ 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ బలపర్చిన బలమైన నాయకుడు హాజీ మహ్మద్ రిజ్వాన్ 12 గంటల వరకు కేవలం 7 వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం కుందర్కి నుంచి బీజేపీ అభ్యర్థి రాంవీర్ ఠాకూర్ విజయం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.

కుంద‌ర్కి ఉప ఎన్నిక‌లో 11 మంది ముస్లిం అభ్యర్థుల‌లో బీజేపీ తరుఫున ఒక్కడే హిందూ అభ్యర్థిని నిల‌బెట్టింది. అదే సమయంలో, ఎస్పీ తన అభ్యర్థిగా సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన హాజీ మహ్మద్ రిజ్వాన్‌కు బరిలోకి దింపింది. 2002లో కుంద‌ర్కి స్థానం నుంచి తొలిసారి ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అయితే 2007లో బీఎస్పీకి చెందిన హాజీ అక్బర్ చేతిలో ఓడిపోయారు. కానీ 2012, 2017లో పునరాగమనం చేసి కుందర్కి సీటును వరుసగా రెండుసార్లు గెలుచుకున్నారు. ఈ సీటు SPకి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే ఈసారి సమాజ్ వాదీ పార్టీ బలమైన కోటను BJP బద్దలు కొట్టింది. ఇది అఖిలేష్ యాదవ్‌కు పీడకల లాంటిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటి వరకు అందుతున్న ఫలితాలు చూస్తుంటే, కుందర్కిలో ముస్లిం ఓట్లను చీల్చడం వల్ల బీజేపీకి లాభం వచ్చిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడు ప్రచారం కూడా పార్టీకి లాభించింది. రామ్‌వీర్ ఠాకూర్ స్వయంగా ముస్లిం ఓటర్లలో చేరిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ముస్లిం విభాగం, ముస్లిం నేతలు కుందర్కిలో క్యాంపులు వేసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిపై అధికార వ్యతిరేకత కూడా కనిపించింది. స్థానిక నేతల్లో కూడా వర్గపోరు చర్చ జరుగుతోంది.

కుందర్కి ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాంవీర్ ఠాకూర్, బీఎస్పీ నుంచి రఫ్తుల్లా జాన్, ఏఐఎంఐఎం నుంచి హఫీజ్ వారిస్, ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి చాంద్ బాబు బరిలో నిలిచారు. కాగా, ఎస్పీకి చెందిన హాజీ మహ్మద్ రిజ్వాన్ బలమైన అభ్యర్థిగా అందరు భావించారు. అయితే ఇది ఫలితాల్లో కనిపించలేదు. ఈసారి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో కుందర్కి నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం విశేషం. ఉప ఎన్నికల్లో ఇక్కడ 57.7% ఓటింగ్ నమోదైంది. ఈ స్థానంలో 60% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యధికంగా ముస్లిం ఓటర్లు ఉన్న సీటు, అత్యధికంగా ఓటింగ్ జరిగిన సీటు, ముస్లిం నేతకు ఎస్పీ టికెట్ ఇచ్చిన సీటు. 1993 నుంచి ఎన్నికల్లో బీజేపీ గెలవలేని సీటు. ఆ సీటుపై ఇంత పెద్ద దుమారం రేగడం విపక్షాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కుందర్కి ఫలితాలపై ఎస్పీ అభ్యర్థి హాజీ రిజ్వాన్ స్పందించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఓటింగ్‌కు కూడా అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉండాలా? ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు భద్రత లేదు. కుందర్కిలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీ పోలీసులపై నమ్మకం లేదని ధ్వజమెత్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..