14 నెలల పసికందుకు విజయవంతంగా గుండె మార్పిడి.. దాత ఎవరంటే..
గుండెను దానం చేసేందుకు గొప్ప మనసుతో అంగీకరించారు. దీంతో ఇటీవల ఆగస్టు 18న డాక్టర్ సుదేశ్ ప్రభు నేతృత్వంలో బాధిత చిన్నారికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్టు శశిరాజ్ వెల్లడించారు.
బెంగుళూరులో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. అత్యంత చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు.. నారాయణ ఆసుపత్రి వైద్యులు గుండెమార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం నారాయణ వైద్య నిపుణులు శశిరాజ్ బృందం ఆపరేషన్ వివరాలను మీడియాకు వివరించారు. అయితే ఈ ఆపరేషన్ ఆగస్టు 18న జరిగిందని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.
రెండున్నరేళ్ల చిన్నారి కోలుకోలేని నాడీసంబంధ స్థితిలో ఉండగా, ఆ చిన్నారి కుటుంబ సభ్యులు మానవత్వంతో ముందడుగు వేశారు. గుండెను దానం చేసేందుకు గొప్ప మనసుతో అంగీకరించారు. దీంతో ఇటీవల ఆగస్టు 18న డాక్టర్ సుదేశ్ ప్రభు నేతృత్వంలో బాధిత చిన్నారికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్టు శశిరాజ్ వెల్లడించారు.
పది నెలల వయసున్నప్పుడే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. నాలుగు నెలలపాటు చికిత్సలు కొనసాగాయని, అయితే గుండెమార్పిడి అవసరమని గుర్తించారు. అందుకు తగిన దాత అందుబాటులోకి రావడంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తినట్టుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం క్షేమంగా ఉందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..