AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డంతా చేపల మయం.. అమ్మేది లేదు, కొనేది లేదు పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!

భారీ వర్షాలు, వరదలకు చేపలు ఎదురెక్కుతాయని అంటారు..కుండపోత వర్షాలు పడినప్పుడు, చెరువులు, కుంటలు ఉప్పొంగినప్పుడు సాధారణంగానే చేపలు విరివిగా లభిస్తాయి. కానీ,ఇప్పుడు ఎక్కడా వర్షాలు లేవు.. వరదలు కూడా లేవు.. అయినప్పటికీ ఓ చోట రోడ్డుపై చేపల వరద కనిపించింది. దాంతో జనం ఎగబడ్డారు.. దొరికిన వారు దొరికినన్నీ చేపలు పట్టుకుని వెళ్లిపోయారు..

రోడ్డంతా చేపల మయం.. అమ్మేది లేదు, కొనేది లేదు పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!
Fish Fell On The Road
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2024 | 3:49 PM

Share

యూపీలోని మోహనా పోలీస్ స్టేషన్ పరిధిలోని డఫ్లిపూర్ పెట్రోల్ పంపు వద్ద టెంపో గోడను ఢీకొనడంతో గందరగోళం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం, ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పంపు వద్ద కూర్చీలపై కూర్చుని ఉన్నారు.. అకస్మాత్తుగా ఒక హై స్పీడ్ టెంపో వారి వైపుకు వేగంగా దూసుకొచ్చింది. దాంతో వారివురు భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. అయితే, అప్పటికే అక్కడి స్థానికుల్ని గమనించిన టెంపు డ్రైవర్‌ బండిని ఓ పక్కకు తీసుకెళ్లాడు.. వారిని కాపాడే క్రమంలో టెంపో డ్రైవర్ ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి ఆగాడు.

అంతే, ఆ టెంపో నిండా చేపలు ఉన్నాయి. అది ఒక్కసారిగా వెళ్లి గోడను బలంగా ఢీకొనడంతో టెంపోలోని చేపలన్నీ నేలపై పడ్డాయి. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు..చేపల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో అక్కడంతా రద్దీగా మారింది. చేపల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దొరికిన వారు దొరికినన్నీ చేపలు పట్టుకుని అక్కడ్నుంచి ఉడాయించారు. బిందెలు, బక్కెట్లు, కవర్లు ఇలా ఎందులో పడితే అందులోనే చేపలు నింపుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన మొత్తం పెట్రోల్‌ పంప్‌లోని సీసీటీవీలో రికార్డయింది.

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టెంపో డ్రైవర్‌ పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ని విచారించగా అతివేగం కారణంగానే టెంపో అదుపు తప్పిందని తేలింది. ఆ తర్వాత రోడ్డుపైకి వెళ్లిన టెంపోను ఆపే ప్రయత్నంలో డ్రైవర్ పెట్రోల్ పంపు వద్దకు తీసుకెళ్లి గోడను ఢీకొట్టి ఆపేశాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..