వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??

వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??

Phani CH

|

Updated on: Nov 24, 2024 | 11:24 AM

రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. సింగిల్‌గా పార్క్‌చేసిన బైకులు ఎక్కడ ఉన్నాయా అని చూస్తాడు.. బైక్‌ కనిపించగానే అదేదో తన సొంతబండిలా దర్జాగా అక్కడినుంచి బైక్‌ వేసుకొని వెళ్లిపోతాడు. ఇలా ఏకంగా ఒకటికాదు రెండు కాదు.. 23 బైకులు కొట్టేశాడు. కొట్టుకొచ్చిన వాటిని వెంటనే అమ్ముకుని సొమ్ముచేసుకున్నాడా అంటే అదీ లేదు... ఒక్కసారిగా గంపగుత్తగా అమ్ముకుందామనుకున్నాడు.

ఇంతలో పోలీసులు వచ్చి చేతులకు బేడీలు వేసి, కటకటాలవెనక్కి పంపించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడానికి చెందిన పల్లంటి శ్రీనివాస్ అలియాస్ శ్రీను బైక్‌ దొంగతానాల్లో దిట్ట. 26 ఏళ్ల ఈ కుర్రాడిపైన చాలానే చోరీ కేసులు ఉన్నాయి. కొంతకాలంగా జంగారెడ్డిగూడెం రామచంద్రపురం ఏరియా శీను నివాసం ఉంటున్నాడు. జంగారెడ్డిగూడెం పరిసర చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డాడు. వ్యాపార సంస్థలు, షాపులు, రద్దీగా ఉన్న ప్రదేశాలలో రెక్కీ నిర్వహించేవాడు. ఆ సమయంలో ఎవరైనా బైక్ పై వచ్చి షాపుముందు బైక్ పార్క్‌చేసి అటు వెళ్లగానే ఇటు బైక్‌ కొట్టేసేవాడు. అలా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలలో బైక్ దొంగతనం కేసులు ఎక్కువగా నమోదు కావడం మొదలయ్యాయి. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రత్యేకంగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది తెలియని శ్రీను ఎప్పటిలాగే తన పని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. శ్రీనునుంచి 23 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. శ్రీను వద్ద రికవరీ చేసిన 23 బైకుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ద్విచక్ర వాహనాలు వాడే వ్యక్తులు వాటిని పార్క్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అదేవిధంగా రాత్రుళ్ళు బైకును కాంపౌండ్ వాల్ బయట కాకుండా లోపల సురక్షిత ప్రదేశాలలో పార్కింగ్ చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర ద్విచక్ర వాహనదారులకు సూచించారు. చోరి చేసిన వెంటనే బైకు ను అమ్మలేక పోవటం , మంచి కొనుగోలు దారుడిని చూసుకుని అన్నింటిని ఒకేసారి అమ్మేద్దామను కునేలోగానే పోలీసులు ఇతగాడిని కటకటాల వెనక్కు నెట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా

TOP 9 ET News: పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం

అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు

చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌

ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!