కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం

కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం

Phani CH

|

Updated on: Nov 24, 2024 | 11:30 AM

హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్‌ అలీఖాన్‌ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్‌ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు.

అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్‌డన్‌ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెలిసి ఇప్పుడు ఓ కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ. 27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్‌ సెర్చ్‌ మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్‌ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్‌డన్‌ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. 1930వ సంవత్సరంలో ఇన్వర్‌గార్డన్‌ పట్టణ కౌన్సిల్‌ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్‌ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు. 1998లో హైల్యాండ్స్‌ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్‌ సభ్యురాలు మాక్సిన్‌ స్మిత్‌ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్‌ కౌన్సిల్‌ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్‌ నగరంలోని ‘ది లారీస్‌’, లాస్‌ఏంజిల్స్‌లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనది కావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడి టాలెంట్ తగలడా.. వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??