Watch: నవ వధువుకు అప్పగింతలు.. ఉన్నట్టుండి ఊళ్లోకి దిగిన పోలీస్ హెలికాఫ్టర్..! కట్ చేస్తే
ఒకేసారి తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుళ్లు, ఒక ఏసీపీతో భద్రత ఏర్పాట్ల కోసం మోహరించారు. ఇంత హై సెక్యూరిటీ ఉందంటే.. ఏ రాజకీయ సమావేశామో లేదంటే, ఎవరో బడా రాజకీయ వేత్త ఇక్కడకు వస్తున్నాడని అనుకుంటే పొరపాటే..! అసలు విషయం ఏంటంటే..
అదో మారుమూల గ్రామం, మురికి కాల్వలు సరిగా లేని ఆ గ్రామంలో ఎటు చూసిన పంట పొలాలే దర్శనమిస్తుంటాయి. అలాంటి ఓ గ్రామంలో ఎన్నడూ లేనంతగా జనసందోహంతో నిండిపోయింది. ఒకేసారి తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుళ్లు, ఒక ఏసీపీతో భద్రత ఏర్పాట్ల కోసం మోహరించారు. ఇంత హై సెక్యూరిటీ ఉందంటే.. ఏ రాజకీయ సమావేశామో లేదంటే, ఎవరో బడా రాజకీయ వేత్త ఇక్కడకు వస్తున్నాడని అనుకుంటే పొరపాటే..! అసలు విషయం ఏంటంటే..
నిశ్శబ్ధంగా ఉన్న ఆ పెల్లెలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గ్రామంలో ఎటు చూసిన పోలీసు భద్రత నేపథ్యంలో హఠాత్తుగా చాపర్ బ్లేడ్‌ల శబ్దం గాలిలో మార్మోగింది. గ్రామస్తులకు అక్కడ ఒక్కసారిగా అసాధారణ దృశ్యం, శబ్ధాలు వినిపించాయి. అయితే, ఇదంతా ఓ అమ్మాయి వివాహా వీడ్కోలు ఏర్పాట్లు.. అవును మీరు విన్నది నిజమే.. గ్రామంలోని ఒక అమ్మాయి పెళ్లి తర్వాత ఆమెను అత్తమామల ఇంటికి సాగనంపేందుకు గానూ ఇంతటి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
యూపీలోని రుస్తాంపూర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక వైరల్‌గా మారింది. రుస్తాంపూర్‌కు చెందిన అంజలి రాజ్‌పుత్‌ను మహమద్పూర్ గ్రామానికి చెందిన అమన్ గురువారం పెళ్లి చేసుకున్నాడు. అయితే శుక్రవారం తన భార్యను అత్తవారింటికి తీసుకెళ్లడానికి రూ.8 లక్షలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. వధువు తల్లి ఇంటి నుంచి తన ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు ఉండడం విశేషం. గ్రామంలోకి హెలికాప్టర్ రావడంతో ప్రజలందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Uttar Pradesh: Flowers showered on the devotees from a helicopter in Prayagraj on the occasion of ‘Mauni Amavasya’. pic.twitter.com/wRixQhCky7
— ANI (@ANI) February 9, 2024
హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. కాగా, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోపై చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పెళ్లి రోజున చెట్లను నాటడం లేదా నిరుపేదలకు సాయం చేస్తే బాగుండేది సూచిస్తున్నారు.. అంత భారీగా వృధా ఖర్చులు చేయటం కంటే..ఆ మొత్తాన్ని ఏదైనా సేవ సంస్థలకు విరాళంగా ఇచ్చే జంటలు చాలా మంది ఉన్నారు. కానీ, ఇక్కడ వీరిది కేవలం షో ఆఫ్ అంటూ మరొకరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..