AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతి.. కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోమంటున్న నెటిజన్లు

కరోనా తర్వాత రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన ప్రయోగాలకు సంబంచిందిన వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా బిర్యానీ పై ఓ యువతి ప్రయోగం చేసింది. దీంతో బిర్యానీ లవర్స్ ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు.

Viral Video: పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతి.. కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోమంటున్న నెటిజన్లు
Viral NewsImage Credit source: social media
Surya Kala
|

Updated on: Nov 23, 2024 | 9:03 PM

Share

ఆహారం విషయంలో ప్రజలలో ప్రతిరోజూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆహారాన్ని రుచికరంగా మార్చడం కోసం ఇటువంటి ప్రయోగాలు ప్రారంభించినప్పటికీ.. కొంతమంది ప్రయోగం పేరుతో పిచ్చి పిచ్చి ప్రయోగాలూ చేసి మంచి ఆహారాన్ని కూడా పాడుచేస్తున్నారు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు వారిని ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నారు కూడా… ప్రస్తుతం బిర్యానీ పై ప్రయోగం చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్లే-జి బిస్కెట్లతో ఓ మహిళ బిర్యానీ తయారు చేసింది. ఇది చూసిన వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

బిర్యానీ అంటే అందరూ ఇష్టపడే వంటకం. దీని పరిమళం ముక్కుకు తగిలితే నోటిలో నీరు వస్తుంది. లక్నో చికెన్ బిర్యానీ, హైదరాబాద్‌ మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, రొయ్యలు ఇలా రకరకాల బిర్యనీల గురించి తెలుసు.. అయితే మీరు ఎప్పుడైనా పార్లే-జితో బిర్యానీ చేస్తారని అనుకున్నారా.. కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోను చూడండి.. ఇందులో పార్లే జి బిస్కెట్లతో బిర్యానీ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన తర్వాత కరోనా తర్వాత సరికొత్త మహమ్మారి వస్తే అది ఈ అమ్మాయి వల్లే వస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక పెద్ద పాత్ర ఉంది. అందులో బియ్యంతో పాటు పార్లే జీ బిస్కెట్లు కూడా కనిపిస్తున్నాయి. మంచి మసాలాలు రుబ్బి ఈ బిర్యానీ చేశానని ఆ మహిళ చెబుతోంది. అంతేకాదు తన వెనుక కనిపించే పిల్లలు తన విద్యార్థులని కూడా మహిళ చెప్పింది. బిర్యానీ తినాలని పట్టుబట్టిన వారికి ఈ స్పెషల్ బిర్యానీ తయారు చేసి ఆశ్చర్యపరిచానని పేర్కొంది.

ఈ వీడియో క్రీమీక్రియేషన్స్byhkr11 ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు హీనా కౌసర్. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఈ మహిళపై కేసు పెట్టాలని ఒకరు.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు.. ఈ పద్ధతిలో బిర్యానీ తయారుచేసి తినే ఆహారాన్ని పాడు చేసింది అంటూ .. మరొకరు కామెంట్ చశారు. ‘ఏదైనా చేయండి కానీ బిర్యానీతో జోక్ చేయవద్దు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ బిస్కట్స్ బిర్యానీకి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..