AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఇదేం బిజినెస్‌ తల్లీ.. చెవిలో గులిమి అమ్ముతూ రోజూకు రూ.9000 సంపాదిస్తున్న మహిళ..!

అయితే, లతీషా జోన్స్‌కి మార్కెటింగ్ ట్రిక్స్ తెలుసు. దాంతో ఆమె మురికి వస్తువులను కస్టమర్‌లను ఆకర్షణీయంగా మార్చడానికి, కస్టమర్‌లను మళ్లీ మళ్లీ ఆకర్షించడానికి ఒక ట్రిక్ ఉపయోగిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్యాకింగ్‌పై తన స్టైల్లో ప్రత్యేక గుర్తులు పెడుతుంది..

వామ్మో ఇదేం బిజినెస్‌ తల్లీ.. చెవిలో గులిమి అమ్ముతూ రోజూకు రూ.9000 సంపాదిస్తున్న మహిళ..!
Selling Earwax
Jyothi Gadda
|

Updated on: Nov 24, 2024 | 12:55 PM

Share

నేటి ఆధునిక కాలంలో ప్రజల ఆదాయం, ఖర్చులు భారీగా పెరగిపోయాయి. దాంతో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయం కోసం వివిధ రకాల పనులు చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరో వైపు ఏదో ఒక సైడ్‌ బిజినెస్‌ చేయటం మొదలుపెడుతున్నారు. అయితే చెవిలో గులిమిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని మీరు ఎప్పుడైనా విన్నారా..? చీ..చీ ఇదేం పని అనంటూ అసహ్యించుకోవచ్చు.. కానీ, ఇది జోక్ కాదు. తన చెవిలోని మురికిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నానని ఓ మహిళ చెప్పింది. సదరు మహిళ తన వ్యాపారం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆమె పేరు లతీషా జోన్స్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. టిక్‌టాక్ ద్వారా ప్రసిద్ధి చెందిన లతీషా జోన్స్ మరింత ఎక్కువగా సంపాదించాలనే క్రమంలో ఒక వినూత్న వ్యాపారం మొదలుపెట్టింది. ఆమె అమ్మే వస్తువులు మనకు అసహ్యంగా అనిపిస్తాయి. కానీ అలాంటి వస్తువులను కొనేవాళ్లు కూడా ఉన్నారు. అదే ప్రత్యేకత. ఇయర్‌వాక్స్ అమ్మడం ద్వారా లతీషా జోన్స్ రోజూ ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు.

కొన్ని రోజుల క్రితం, లతీషా జోన్స్ తన అదనపు ఆదాయం గురించి టిక్‌టాక్‌లో వీడియోను పంచుకున్నారు. లతీషా జోన్స్ తన చెవిలో గులిమిని అమ్ముతుంది. ఈ పని మనకు అసహ్యంగా, వింతగా అనిపించవచ్చు. కానీ ఆమె ఈ పనిచేస్తూ మంచి డబ్బు సంపాదిస్తోంది. చెవిలో గులిమి అమ్మి వంద, రెండు వందలు కాదు.. ఏకంగా ప్రతిరోజు రూ.9 వేల వరకు సంపాదిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇందుకోసం ఆమె మొదట కాటన్ ఇయర్ బడ్స్ నుండి చెవిలోని గులిమిని తొలగిస్తుంది. అలా వ్యాక్స్ చేసిన ఇయర్ బడ్స్‌ని ఒక కవర్‌లో వేసి పూర్తిగా ప్యాక్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని కస్టమర్లకు పంపుతుంది. దీని ధర దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధూళికి ఎక్కువ డబ్బు చెల్లిస్తారు కస్టమర్లు. ఇది ప్రత్యేకమైనది, ఆసక్తికరమైనది అంటూ లతీషా జోన్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే, లతీషా జోన్స్‌కి మార్కెటింగ్ ట్రిక్స్ తెలుసు. దాంతో ఆమె మురికి వస్తువులను కస్టమర్‌లను ఆకర్షణీయంగా మార్చడానికి, కస్టమర్‌లను మళ్లీ మళ్లీ ఆకర్షించడానికి ఒక ట్రిక్ ఉపయోగిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్యాకింగ్‌పై ముద్దులు పెడుతుంది. అలా ప్రతి ప్యాకెట్‌పై ఆమె లిప్ స్టిక్ గుర్తు ఉంటుంది. ఇలాంటి వింత వస్తువులను అమ్మి డబ్బు సంపాదించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే వాటిని ఎవరు కొనుగోలు చేస్తారన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. అడల్ట్ యాప్స్‌లో ఇలాంటి వాటిని కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ అంటున్నారు నిపుణులు. అయితే, లతీషా ఎక్కడ అమ్ముతుంది అనే రహస్యాన్ని మాత్రం బయటపెట్టలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..