దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకు పాపం ఇలా

ఇదిలా ఉంటే, పులిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పులిపై దాడి చేసిన వారిలో 9 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. జూలైలో వరదలు వచ్చినప్పటి నుండి వన్యప్రాణులు నిరంతరం గ్రామీణ ప్రాంతాల వైపు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

దారితప్పి వచ్చిన పెద్ద పులి.. దారుణంగా దాడి చేసిన జనం.. చివరకు పాపం ఇలా
Tiger (Representational Image)
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 24, 2024 | 1:17 PM

దారి తప్పిన ఓ పెద్దపులి అడవి నుంచి బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. దాంతో ఒక్కసారిగా అక్కడివారంతా కలిసి దానిపై ముక్కుమ్మడి దాడి చేశారు.. దాంతో ఆ పెద్దపులి కంటి చూపును కోల్పోయింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోది. పులి పరిస్థితి ఎలా ఉంటుందోనని పశువైద్యులు, అటవీశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా ఎక్కడ జరిగింది.. ఏం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే…

పెద్దపుల్లిని చావుకు దగ్గర చేసిన ఈ షాకింగ్‌ ఘటన అస్సాంకి సంబంధించినదిగా తెలిసింది. అస్సాంలోని నాగావ్ జిల్లా కామాఖ్య రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఒక పెద్ద పులి బయటకు వచ్చి గ్రామంలోకి ప్రవేశించింది. అది మూడేళ్ల రాయల్ బెంగాల్ టైగర్‌గా అని తెలిసింది. పులిని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా పులిపై దాడి చేశారు. ఈ దాడిలో పులి తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు పులిపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో అది వారి నుంచి తప్పించుకునేందుకు నదిలోకి దూకింది.

ఇవి కూడా చదవండి

అయితే, 17 గంటల తర్వాత అటవీ సిబ్బంది దానిని రక్షించారు. అత్యవసర పరిస్థితిలో పులిని చికిత్స కోసం కాజిరంగాలోని వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రానికి తరలించారు. పులి రెండు కళ్లు బాగా దెబ్బతిన్నాయని సీడబ్ల్యూఆర్‌సీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ భాస్కర్‌ చౌదరి తెలిపారు. ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తలపై, అంతర్గత అవయవాలపై కూడా గాయాలయ్యాయి. కంటి గాయాలు మెరుగుపడకపోతే, జంతువును తిరిగి అడవిలోకి వదలడం అసాధ్యమని డాక్టర్ చౌదరి చెప్పారు.

ఇదిలా ఉంటే, పులిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పులిపై దాడి చేసిన వారిలో 9 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. జూలైలో వరదలు వచ్చినప్పటి నుండి వన్యప్రాణులు నిరంతరం గ్రామీణ ప్రాంతాల వైపు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పులిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారని, ప్రాణాలను రక్షించుకోవటం కోసమే పులిపై దాడిచేసినట్టుగా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!