AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Early Dinner: ముందుగా తింటే ముప్పు తక్కువ.. అధిక బరువు సమస్య ఫసక్..

సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య తినడం వల్ల మీ అనారోగ్యాన్ని అరికట్టవచ్చు. అలాగే కొవ్వు నిల్వ చేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న 16 మంది రోగులను పరీక్షించి చేసిన ఓ అధ్యయనంలో ప్రతి రోజూ 5 గంటలకు భోజనం చేసే వారిని రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసే వారిని పరీక్షించారు.

Early Dinner: ముందుగా తింటే ముప్పు తక్కువ.. అధిక బరువు సమస్య ఫసక్..
Night Dinner
Nikhil
|

Updated on: Jun 17, 2023 | 5:00 PM

Share

సూర్యాస్తమయానికి ముందు రాత్రి భోజనం చేయమని నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు ముందుగా రాత్రి భోజనం ముగిస్తే సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. త్వరగా తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు కేలరీలు బర్న్ చేయడానికి తగినంత సమయం లభించదు. ఇది మీ సంతృప్తి హార్మోన్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య తినడం వల్ల మీ అనారోగ్యాన్ని అరికట్టవచ్చు. అలాగే కొవ్వు నిల్వ చేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న 16 మంది రోగులను పరీక్షించి చేసిన ఓ అధ్యయనంలో ప్రతి రోజూ 5 గంటలకు భోజనం చేసే వారిని రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసే వారిని పరీక్షించారు. ఈ అధ్యయనం సాయంత్రం ఆరు తర్వాత తినడం వల్ల ఆకలి స్థాయిలు, ఆకలిని నియంత్రించే హార్మోన్లు లెప్టిన్, గ్రెలిన్ ప్రభావితం అవుతాయని కనుగొన్నారు. ఇది కేలరీలు బర్న్ చేసే విధానం, కొవ్వు నిల్వ చేసే విధానాన్ని కూడా ప్రభావితం చేసింది.

ఆరోగ్య శ్రేయస్సు ఇలా

రాత్రి భోజనం ముందుగా చేయడం వల్ల మీ సిర్కాడియన్ రిథమ్ రీలైన్‌లో విభిన్న ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ సూర్యాస్తమయం తర్వాత మీ రక్తప్రవాహంలో విడుదలవుతుంది. మీరు సూర్యాస్తమయం తర్వాత ఎక్కువ భోజనం చేసినప్పుడు మీరు ఇన్సులిన్‌ను విడుదల చేస్తారు. ఇది మీ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ఆహారానికి సంబంధించి జీర్ణక్రియకు ప్రాథమిక జీవక్రియ ప్రతిస్పందనగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మంచి నిద్ర 

సాయంత్రం సమయంలో భోజనం చేయడం వల్ల  మీ శరీరానికి రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మెలటోనిన్ విడుదల చేయడానికి తగినంత సమయం ఉంటుంది. అది గరిష్ట పెరుగుదల హార్మోన్, రిపేర్ ఎంజైమ్‌లు, పునరుద్ధరణ ఎంజైమ్‌లు ఇవన్నీ స్రవిస్తాయి. అందుకే మీరు శక్తివంతంగా, రిఫ్రెష్‌గా మెలగండి. దీని వల్ల కలిగే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  మీ కోరికలు చాలా తక్కువ లేదా పూర్తిగా అదుపులో ఉంటాయి. మీరు ఫ్లాట్ కడుపుతో మేల్కొనే అవకాశం ఉంటుంది. ఇది మీ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.