Tomato: టమోటాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయిపోండి..
ఏ కూర చేయాలన్నా చాలా మంది గృహిణులకి కావలసిన ఐటెమ్ టమోటా. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ. 140 కి పైనే ఉంది.

ఏ కూర చేయాలన్నా చాలా మంది గృహిణులకి కావలసిన ఐటెమ్ టమోటా. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ. 140 కి పైనే ఉంది. ఈ సమయంలో టమోటాలు కొనడం సామాన్యులకు కష్టమైన పని. మరి ఇలాంటి సమయంలో టమోటాలు పాడవ్వకుండా.. ఎక్కువకాలం నిల్వ ఉంచాలంటే.. ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందామా..
టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. సాధారణ గది ఉష్ణోగ్రతలో బయటే నిల్వ చేయాలి. ముందుగా పండిన వాటిని కూరల్లో వాడండి. పండిన టమోటాలు అధిక మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమ, మీరు వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. టమోటాలు త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కవ కాలం నిల్వ ఉంచడం కోసం మీరు తొడిమ భాగం వైపును కిందకు తిప్పి నిల్వ చేయండి. ఈ విధంగా సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడం వలన వారం పాటు తాజాగా ఉంటాయి.
మరొక చిట్కా ఏంటంటే.. టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేయండి. ముక్కలను డీప్ ఫ్రీజర్‌లో ఉంచితే అవి గట్టిపడతాయి. గాలి చొరబడని కంటైనర్‌లో రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఈ విధంగా టమోటాలను 3-4 నెలల పాటు నిల్వ చేయవచ్చు. మరొక టిప్ ఏంటంటే.. టమోటాలను బాగా కడిగి వస్త్రంపై ఆరబెట్టండి. తడి లేకుండా పొడి బట్టతో తుడిచి ముక్కలుగా కట్ చేయండి. బ్లెండర్లో వేసి మెత్తని ప్యూరీని తయారు చేయండి. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. 15 రోజుల వరకు ప్యూరీ తాజాగా ఉంటుంది.