HDL Cholesterol: సహజ సిద్ధంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగాలంటే.. ఈ పండ్లు తినాల్సిందే!

మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ మన శరీర బరువును పెంచుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు దీని వల్ల తలెత్తుతాయి. అయితే మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. వేసవిలో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్‌) పెంచే పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు పదికాలాల పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

HDL Cholesterol: సహజ సిద్ధంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగాలంటే.. ఈ పండ్లు తినాల్సిందే!
Hdl Cholesterol Food
Follow us

|

Updated on: Apr 29, 2024 | 7:46 PM

మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ మన శరీర బరువును పెంచుతుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు దీని వల్ల తలెత్తుతాయి. అయితే మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. వేసవిలో మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్‌) పెంచే పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు పదికాలాల పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బెర్రీ పండ్లు

బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో సహజంగా HDL స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

పుచ్చకాయ

శరీరంలో చెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి పుచ్చకాయ ఉపయోగపడుతుంది. సాయంత్రం వెళల్లో చక్కెర స్నాక్స్ బదులుగా పుచ్చకాయను తినడం వల్ల సహజంగా HDL స్థాయిలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

కీవీ పండు

కివీ పండు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తాజా పరిశోధనలో తేలింది.

అవోకాడో పండు

అవోకాడోస్‌లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

నారింజ

నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల HDL కొలెస్ట్రాల్‌ను సహజసిద్ధంగా పెంపొందించడానికి సహాయపడుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు పలుమార్లు వెల్లడించాయి.

బొప్పాయి

వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.