Iron Rich Foods: తరచూ నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీ ఒంట్లో ఈ సమస్య ఉన్నట్లే..
ఒంట్లో ఐరన్ స్థాయిలు తగ్గితే, రక్తహీనత వస్తుంది. దీంతో శరీరంలో బలహీనత తలెత్తుతుంది. దీనివల్ల రోజంతా అలసట, తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఐరన్ శాతం పెరిగే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్ లోపంతో బాధపడుతుంటే ఈ కింది 3 పదార్ధాలు మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శరీరంలో రక్త ప్రసరణ, ఐరన్ స్థాయిలు బాగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పాటించాలి. అవును.. శరీరం సరిగ్గా పనిచేయాలంటే అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో ఐరన్ లేకపోతే, శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత అంటే రక్తంలోని ఆరోగ్యకరమైన రక్త కణాలను తగ్గించే ప్రక్రియ. ఈ రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి పనిచేస్తాయి. ఒంట్లో ఐరన్ స్థాయిలు తగ్గితే, రక్తహీనత వస్తుంది. దీంతో శరీరంలో బలహీనత తలెత్తుతుంది. దీనివల్ల రోజంతా అలసట, తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఐరన్ శాతం పెరిగే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్ లోపంతో బాధపడుతుంటే ఈ కింది 3 పదార్ధాలు మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తెలుపు, నలుపు నువ్వులు
100 గ్రాముల నువ్వులలో 14 నుంచి 16 మి.గ్రా ఇనుము ఉంటుంది. మీరు రోజూ 1-2 టీస్పూన్ల వేయించిన నువ్వులు తినవచ్చు. లేదంటే దీన్ని చట్నీ, లడ్డుగా కూడా తినవచ్చు. ఏ విధంగానైనా ప్రతిరోజూ మీ ఆహారంలో తీసుకోవచ్చు.
రాజ్‌గిరా ధాన్యం
రాజ్‌గిరా అనేది ఐరన్ సమృద్ధిగా ఉండే చిరు ధాన్యం. దీనిని గంజిలా ఉడికించి తినవచ్చు. లేదా లడ్డులుగా చేసి చిరుతిండిగా తినవచ్చు. అలాగే దీనిని రోటీగా కూడా చేసుకోవచ్చు. ఐరన్ సమృద్ధిగా ఉండటమే కాకుండా ఈ ధాన్యాలు కొవ్వు రహితంగా కూడా ఉంటాయి.
ఉద్నా పప్పు
100 గ్రాముల ఉద్నా పప్పులో 7 నుంచి 9 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. దీనిని రకరకాల వంటకాలకు ఉపయోగించవచ్చు. దోస, ఇడ్లీ కూడా ఉద్నా పప్పుతో తయారు చేసుకుని తినవచ్చు. దీనిని ఇతర పప్పుధాన్యాలతో కూడా కలిపి తినవచ్చు.
శరీరంలో ఇనుము శోషణను పెంచడానికి భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగకుండా ఉండాలి. ప్రత్యామ్నాయంగా విటమిన్ సి తో పాటు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. నిమ్మకాయ, టమోటా, గూస్బెర్రీతో ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరం ఇనుమును బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.