AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Packages: హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్‌సీటీసీ కేరళ ప్యాకేజీతో కొత్త జంటలకు పండగే..!

కేరళ భారతదేశంలో చాలా అందమైన రాష్ట్రం. కేరళను దేవుడి దేశం అని కూడా అంటారు. ఇక్కడ అనేక టూర్ ప్లేస్‌లు ఆకర్షనీయంగా ఉంటాయి. జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ రావడానికి ఇష్టపడతారు. మీరు కూడా ప్రస్తుత వేసవిలో కేరళ రావాలని ఆలోచిస్తున్నట్లయితే ఐఆర్‌సీటీసీ కేరళ రాష్ట్రం కోసం ఒక ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది.

IRCTC Packages: హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్‌సీటీసీ కేరళ ప్యాకేజీతో కొత్త జంటలకు పండగే..!
Irctc Kerala Tour
Nikhil
|

Updated on: Apr 20, 2024 | 5:15 PM

Share

భారతదేశంలో సమ్మర్ హాలిడేస్ సీజన్ స్టార్ట్ అయ్యింది. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా సాగుతుండడంతో కొత్త జంటలు హానీమూన్ వెళ్లడానికి మంచి టూర్ ప్లేస్‌ల గురించి తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ కేరళ ప్యాకేజీలను చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. కేరళ భారతదేశంలో చాలా అందమైన రాష్ట్రం. కేరళను దేవుడి దేశం అని కూడా అంటారు. ఇక్కడ అనేక టూర్ ప్లేస్‌లు ఆకర్షనీయంగా ఉంటాయి. జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ రావడానికి ఇష్టపడతారు. మీరు కూడా ప్రస్తుత వేసవిలో కేరళ రావాలని ఆలోచిస్తున్నట్లయితే ఐఆర్‌సీటీసీ కేరళ రాష్ట్రం కోసం ఒక ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేరళ టూర్ ప్యాకేజీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐఆర్‌సీటీసీకు సంబంధించిన ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ పేరు కల్చరల్ కేరళ. ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీ ఏప్రిల్ 28న హైదరాబాద్ ప్రారంభమవుతుంది. ట్రావెలింగ్ మోడ్ విమానంలో ఉంటుంది. ఇందులో హైదరాబాద్ నుంచి కొచ్చికి, త్రివేండ్రం నుంచి హైదరాబాద్ కు ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించవచ్చు.  ఈ ప్యాకేజీలో 6 బ్రేక్ఫాస్ట్లు, 6 డిన్నర్లు, 1 లంచ్ ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీలో మీరు అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం సందర్శించవచ్చు.  కేరళ కల్చరల్ ప్యాకేజీలో మీరు కొచ్చిలో 1 రాత్రి, మున్నార్లో 2 రాత్రులు, తేక్కడిలో 1 రాత్రి, కుమరకోమ్లో 1 రాత్రి, త్రివేండ్రంలో 1 రాత్రి బస చేయవచ్చు. మీరు మొత్తం ప్యాకేజీ అంతటా ఏసీ బస్సు ద్వారా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా మీరు ఈ ప్యాకేజీలో ప్రయాణ బీమాను కూడా పొందుతారు. ఈ ప్యాకేజీలో మొత్తం సీట్ల సంఖ్య 29గా ఉంటుంది

కల్చరల్ కేరళ టూర్ ప్యాకేజీ రేట్లు ఇలా

కల్చరల్ కేరళ  ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ ధర సింగిల్ బుకింగ్ పై మీరు రూ. 53,100గా ఉంది. డబుల్ షేరింగ్‌కు రూ. 35,700, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 33,750 ఖర్చు అవుతుంది. దీంతోపాటు 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకుంటే రూ.29,900, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకపోతే రూ.23,300, 2 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకపోతే రూ.15,400గా ఉంటుంది. మీరు కూడా ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..