Lifestyle: షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడం వల్ల రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్‌కు దారి తీస్తుంది. కిడ్నీలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఇక అధిక రక్త చక్కెర స్థాయిలు కంటి వెనుక రెటీనాను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. దీనివల్ల కంటి చూపు తగ్గుతుంది...

Lifestyle: షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
Diabetes
Follow us

|

Updated on: Apr 20, 2024 | 11:17 AM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. ప్రతీ ఏటా కోట్లాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడే 50 ఏళ్లు నిండిన వారిలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండని వారిలో కనపిస్తోంది. ముఖ్యంగా శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మధుమేహం వల్ల శరీరంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని తెలిసిందే. షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్న వారిలో కంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసిందే. కొందరిలో కళ్లు సరిగ్గా కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు. ఇంతకీ మధుమేహం వల్ల కంటి సమస్యలు ఎందుకు వస్తాయి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.? ఇప్పడు తెలుసుకుందాం..

శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరగడం వల్ల రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్‌కు దారి తీస్తుంది. కిడ్నీలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఇక అధిక రక్త చక్కెర స్థాయిలు కంటి వెనుక రెటీనాను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారు. దీనివల్ల కంటి చూపు తగ్గుతుంది. అయితే త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి, చికిత్స చేయకపోతే… అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి వల్ల రెటీనాలోని రక్తనాళాలు అసాధారణ స్థాయిలో వ్యాకోచిస్తాయి. ఇది కంటి నుంచి ద్రవం అడ్డుపడటానికి కారణమవుతుంది. ఇది ఒక రకమైన గ్లాకోమాకు కారణమవుతుంది. గ్లాకోమా అనేది కంటి వ్యాధి, ఇది దృష్టి కోల్పోవడానికి కారణమవుతుంది.

ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి…

* కొన్ని రకాల జీవనశైలి మార్పులతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బచ్చలికూర, బ్రోకలీ, నారింజ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టొమాటో, రెడ్ క్యాప్సికమ్, పుచ్చకాయ, మామిడి, చేపలు, పాలు, గుడ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

* అధిక బరువుతో బాధపడే వారు కచ్చితంగా బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం నడక లేదా సైక్లింగ్ వంటి వారానికి కనీసం 150 నిమిషాలైనా చేయాలి. రోజుకు 10,000 అడుగులు వేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

* షుగర్‌తో బాధపడే వారు క్రమంతప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే త్వరగా గుర్తిస్తే చికిత్సను కూడా అంతే త్వరగా ప్రారంభిస్తే సమస్య పరిష్కారం లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles