Safest tourist spots: ఒంటరిగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ దేశాలైతే ఫుల్ సేఫ్టీ.. ఈ విషయాలను మాత్రం మర్చిపోవద్దు..

ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లి సేదదీరాలని ఆలోచిస్తున్నారా? మీకు దూర దేశాలకు ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టమా? కొన్ని దేశాలు ఒంటరిగా మహిళలు ప్రయాణించడానికి అనువైనవిగా, సురక్షితమైనవిగా కనిపిస్తాయి. అవేంటో చూద్దాం..

Safest tourist spots: ఒంటరిగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ దేశాలైతే ఫుల్ సేఫ్టీ.. ఈ విషయాలను మాత్రం మర్చిపోవద్దు..
Women Friendly Travel Destinations
Follow us

|

Updated on: Mar 22, 2023 | 2:30 PM

వయసు మీద పడుతోంది.. ఇప్పటి వరకూ ఇల్లు, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే అంతా గడచిపోయింది. 50 ఏళ్ల దాటిపోయాయి. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక ఇప్పుడైనా కాస్త స్వేచ్ఛ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లి సేదదీరాలని ఆలోచిస్తున్నారా? మీకు దూర దేశాలకు ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టమా? అయితే కొన్ని ప్రధాన అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధ మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మీ భద్రతను పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని దేశాలు ఒంటరిగా మహిళలు ప్రయాణించడానికి అనువైనవిగా, సురక్షితమైనవిగా కనిపిస్తాయి. అయితే మీరు ఒంటరిగా వెళ్లాలనుకొంటున్న దేశాన్ని ఎంపిక చేసుకొనే ముందు కొన్ని ప్రాధాన్య అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం..

ప్రయాణ సలహాలను తనిఖీ చేయండి.. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ , యూకే ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్, కెనడియన్ గవర్నమెంట్ లకు చెందిన ట్రావెల్ అడ్వైజరీ వెబ్‌సైట్‌ల నుంచి అధికారిక ప్రయాణ సలహాలను తెలుసుకోండి. అందులో వారు ఏ దేశాలు ప్రయాణానికి సురక్షితమైనవిగా భావిస్తున్నారో వివరిస్తారు. అలాగే ప్రపంచంలో ఏమి జరుగుతుందో వివరించి, ఏ దేశాలకు వెళ్లడం మంచిదో సూచనలిస్తారు.

భద్రతా ర్యాంకింగ్‌.. గ్లోబల్ పీస్ ఇండెక్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటీటివ్‌నెస్ రిపోర్ట్ వంటి సంస్థలు ఆయా దేశాలకు ఇచ్చిన భద్రతా ర్యాంకింగ్‌లు నివేదికలను తనిఖీ చేయండి. తక్కువ నేరాల రేట్లు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, బలమైన పర్యాటక మౌలిక సదుపాయాలు ఉన్న దేశాలను గుర్తించండి.

ఇవి కూడా చదవండి

నిపుణుల సిఫార్సులను చదవండి.. దూర ప్రయాణాల్లో నైపుణ్యం కలిగిన వారు, బ్లాగర్ల నుండి సిఫార్సులను స్వీకరించండి. ఏఏఆర్పీ ట్రావెల్ విభాగం, నెవర్ స్టాప్ ట్రావెలింగ్ వెబ్‌సైట్ మంచి సమాచారాన్ని అందిస్తాయి.

వినియోగదారు సమీక్షలు.. ఇతర ప్రయాణికులు ఏ గమ్యస్థానాలను సిఫార్సు చేస్తున్నారో చూడడానికి ప్రసిద్ధ ప్రయాణ వెబ్‌సైట్‌లు , ట్రిప్అడ్వైజర్, లోన్లీ ప్లానెట్ వంటి ఫోరమ్‌ల నుంచి వినియోగదారు సమీక్షలను విశ్లేషించండి .

ఇవి కూడా చూడాలి..

  • తక్కువ నేరాల రేట్లు ఉన్న, పర్యాటకులకు సురక్షితంగా భావించే దేశాలను ఎన్నుకోండి.
  • ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోండి .
  • పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న దేశాల కోసం చూడండి . కొన్ని దేశాలు ఒంటరిగా ప్రయాణించే మహిళల పట్ల ప్రత్యేకంగా స్నేహపూర్వకంగా ఉంటాయి.
  • మీరు వెళ్లే ముందు స్థానిక ఆచారాలు, సంస్కృతిని తెలుసుకోండి .
  • స్థానిక ఆచారాలు, నిబంధనలను అర్థం చేసుకోవడం వలన మీరు అపార్థాలు లేదా అసౌకర్య పరిస్థితులను నివారించవచ్చు.

50 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళకు ఇవి బెస్ట్..

స్విట్జర్లాండ్.. స్విట్జర్లాండ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవన ప్రమాణాలతో కూడిన అందమైన దేశం. దాని అద్భుతమైన ఆల్పైన్ దృశ్యాలు, ప్రపంచ-స్థాయి మ్యూజియంలు, గ్యాలరీలు ఆకట్టుకుంటాయి. అంతేకాక తక్కువ నేరాల రేటు, అద్భుతమైన మౌలిక సదుపాయాలతో, స్విట్జర్లాండ్ తరచుగా ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

జపాన్.. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వం, అధునాతన సాంకేతికత, ఉన్నత జీవన ప్రమాణాలతో కూడిన ఆకర్షణీయమైన దేశం. పురాతన సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికత ల ప్రత్యేక సమ్మేళనం. జపాన్లో తక్కువ నేరాల రేట్లు, సమర్థవంతమైన ప్రజా రవాణా, అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన సంస్కృతి ఉంటుంది. సీనియర్ మహిళా ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన గమ్యస్థానం ఇది,

ఐస్‌లాండ్ .. విలక్షణమైన సంస్కృతి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో మంత్రముగ్దులను చేసే అద్భుతమైన దేశం ఇది. దీని భూఉష్ణ కార్యకలాపాలు, హిమానీనదాలు, జలపాతాలు, ఇతర సహజ ఆకర్షణలు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మార్చాయి. ఐస్‌ల్యాండ్‌లో తక్కువ నేరాల రేట్లు, బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, అధిక-నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఇంగ్లీష్ మాట్లాడే జనాభా ఉంటారు. ఇది 60 ఏళ్లు పైబడిన మహిళలకు సౌకర్యవంతమైన గమ్యస్థానంగా నిలుస్తోంది.

న్యూజిలాండ్.. ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఆకర్షిస్తుంది. ఇక్కడి పర్వతాలు, సరస్సులు, బీచ్‌లు, ఇతర సహజ ఆకర్షణలు దీనిని ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మర్చాయి. ఇక్కడ కూడా తక్కువ నేరాల రేట్లు, స్నేహపూర్వక సంస్కృతి, అధిక-నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ, మంచి పర్యాటక మౌలిక సదుపాయాలు ఉంటాయి.

కెనడా.. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇది. గొప్ప సంస్కృతి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా నేరాల రేటు చాలా తక్కువ. స్నేహపూర్వక సంస్కృతి, మంచి ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

  • వీటితో పాటు ఫిన్ ల్యాండ్, జర్మనీ, సింగపూర్, నార్వే, కోస్టా రికా దేశాలు కూడా మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అత్యుత్తమ మౌలిక వసతులు కల్పిస్తాయి. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, ఆ దేశాల అందాలు ఆకర్షిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు