Sleeping Kids: రోజులో 39 నిమిషాల తక్కువ నిద్ర పోయినా ప్రమాదమే.. తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Mar 22, 2023 | 1:48 PM

పిల్లలకు నిద్ర ఎంత సమయం అవసరం..? మంచి నిద్ర లేకుంటే ఏం జరుగుతుంది..? రోజు నిద్రలో 39 నిమిషాలు తగ్గినా.. అది పెద్ద ప్రమాదానికి కారణంగా మారొచ్చని..

Sleeping Kids: రోజులో 39 నిమిషాల తక్కువ నిద్ర పోయినా ప్రమాదమే.. తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
Sleeping Kids
Follow us

పెద్దలకు నిద్ర ఎంత అవసరమో. పిల్లలకు నిద్ర అంతకంటే ఎక్కువ అవసరం.దీనికి సంబంధించి ఇటీవల ఓ అధ్యయనం జరిగింది. 39 నిమిషాల నిద్ర లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు చాలా సార్లు నొక్కి చెబుతోంది. రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి మానసిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తుంటారు. అలాంటి వ్యక్తులు నిరాశ, ఆందోళన, ఇతర మానసిక వ్యాధులకు గురవుతారు. సాధారణంగా పెద్దవారిలో నిద్ర సమస్య కనిపిస్తుంది. అయితే నిద్రలేమి ప్రభావం పిల్లల ఆరోగ్యంపైనా ఎక్కువగా కనిపిస్తోందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? నిద్ర లేకపోవడం పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. దీనికి సంబంధించి ఇటీవల ఓ అధ్యయనం విడుదల చేశారు వైద్యులు. ఈ అధ్యయనంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

న్యూజిలాండ్‌లోని 100 మంది పిల్లలపై అధ్యయనం చేశారు పరిశోధకులు. వారు వెళ్లడించిన వివరాలను మనం చూద్దాం.. జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ఒక అధ్యయనం ప్రచురించబడింది. ఇందులో న్యూజిలాండ్‌లో నివసిస్తున్న 8 నుంచి 12 ఏళ్ల పిల్లలను అధ్యయనం చేశారు. ఈ పిల్లలందరి నిద్రను పర్యవేక్షించారు. ఒక వారం పిల్లలు సాధారణం కంటే ఒక గంట ముందుగానే పడుకున్నారని.. మరో వారం వారు ఒక గంట తర్వాత నిద్రపోయారని పరిశోధకులు గమనించారు. పిల్లల నిద్రలో ఆటంకాలు కూడా గమనించబడ్డాయి.

39 నిమిషాల తగ్గినా ప్రమాదమే..

అధ్యయనంలో ఏం కనిపించింది. పరిశోధకులు కూడా దీనిని గమనించబోతున్నారు. నిత్యం చక్కటి నిద్రపోయేవారు ఎంతంటే.. రోజులో 8 నుంచి 11 గంటల పాటు నిద్రపోయేవారు. వారు తమ ఆరోగ్యం మెరుగ్గా ఉంది. అదే సమయంలో, ఇలా నిద్రపోయేవారు ప్రతిరోజూ 39 నిమిషాలు తక్కువ నిద్రపోతే… వారం రోజుల తర్వాత అలాంటి పిల్లలకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని తేలింది. వారు తమ దృష్టి సారించలేకపోయారని తేలింది.

ఇతర అంశాలను కూడా అధ్యయనంలో చేర్చారు. తల్లిదండ్రులు, ఇతర తోటివారితో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పట్ల వారి వైఖరి ఏంటి? పిల్లలను చదువుకోవడానికి అస్సలు ఇష్టపడరని తేలింది. వీరు శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా లేదా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడానికి పాఠశాలలో సమయం గడిపిన తర్వాత మీకు శక్తి మిగిలి ఉందా? చాలా మంది పిల్లలు కుదరదని సమాధానం వచ్చింది.

అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరమై వైద్యులు తేల్చారు. వారు నిద్రపోయే సమయంలో కొద్దిగా తగ్గినా పెద్ద సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu