AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japanese Secrets: ఆరోగ్యం, ఆనందం కోసం జపనీస్ ఫాలో అయ్యే హ్యాబిట్స్‌ ఇవే..

ప్రపంచంలోని మిగతా లైఫ్ స్టైల్స్ తో పోలిస్తే.. జపనీస్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. జపాన్‌లో మనుషుల సగటు జీవితకాలం 86 ఏండ్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్. అలాగే అందం, ఆరోగ్యం విషయంలోనూ జపనీయులు అందరికంటే ముందుంటారు. ఇంత ప్రత్యేకంగా ఉండేందుకు జపనీయులు ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతారు. జపనీస్ హ్యాపీ లైఫ్‌స్టైల్‌కు సీక్రెట్స్ ఏంటి?

Japanese Secrets: ఆరోగ్యం, ఆనందం కోసం జపనీస్ ఫాలో అయ్యే హ్యాబిట్స్‌ ఇవే..
Japanese Secrets
Nikhil
|

Updated on: Oct 14, 2025 | 4:45 PM

Share

జపనీస్ లైఫ్‌స్టైల్‌లో పరిశుభ్రత, డిసిప్లిన్, డైట్, నేచర్‌‌తో కనెక్షన్.. ఇలా చాలా అంశాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా  జపనీయులు తమ పరిసరాలను క్లీన్ గా ఉంచుకుంటారు.  ప్రపంచంలోని క్లీనెస్ట్ దేశాల్లో జపాన్ కూడా ఒకటి. పరిసరాలు మాత్రమే కాదు, వ్యక్తిగత శుభ్రతలోనూ జపాన్  ముందుంటుంది. జపనీయుల శుభ్రత ఎలా ఉంటుందంటే.. అక్కడి కరెన్సీ నోట్లు కూడా తళతళ మెరిసిపోతుంటాయి. ఎందుకంటే వాటిని ఎవరూ చేతులతో ముట్టరు. అందుకే వాటికి మురికి పట్టదు. షాప్స్, హోటళ్లలో డబ్బు చేతులు మారదు.  ఏ షాపుకెళ్లినా డబ్బు వేయడానికి ఒక ట్రే ఉంటుంది. అందులోనే డబ్బు వేస్తారు. శుభ్రతకు జపనీయులు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మరి.

చిన్నప్పట్నుంచే..

జపాన్‌లో పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణను అలవాటు చేస్తారు. చెప్పులు బయట వదిలడం అనేది జపనీస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే రూల్.  ఇంటికి వెళ్లినా, స్కూల్ కు వెళ్లినా.. చెప్పులు, షూస్ బయటే  వదిలి లోపలికి వెళ్తారు. చెప్పులు పెట్టేందుకు ప్రతీ చోట సెపరేట్ గా ర్యాక్స్ ను అమర్చుతారు.  అలాగే ఏదైనా పనికి లేదా మీటింగ్ కి వెళ్లేటప్పుడు.. వెళ్లాల్సిన  టైం కంటే పది నిముషాలు ముందే వెళ్లడం జపనీస్ కు అలవాటు

డైట్ ఇలా..

జపనీయులు ఎక్కువకాలం బతకడానికి వాళ్లు తీసుకునే ఆహారమే కారణమని చెప్పొచ్చు. వాళ్లు ప్యాక్డ్ ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండిన ఫుడ్ నే తీసుకుంటారు.  జపనీస్ ఎక్కువగా సీ ఫుడ్ తీసుకుంటారు. దానివల్ల వాళ్లో  ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తక్కువ.  ఇక అన్నింటికంటే ముఖ్యంగా జపనీయులు తినేటప్పుడు  కడుపు నిండుగా కాకుండా పొట్టలో కాస్త గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. భోజనానికి వాడే ప్లేట్లు కూడా చిన్నవి వాడతారు.

రెస్పాన్సిబిలిటీ

జపాన్‌లో ట్రైన్ లేదా బస్ లాంటివి ఎక్కితే చాలా సైలెంట్‌గా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సైలెంట్‌గా ఉండాలన్న రూల్‌ను వాళ్లు పక్కాగా పాటిస్తారు. జపాన్‌లో ఎవరైనా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వాళ్లు తప్పక మాస్క్‌లు పెట్టుకుంటారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు.

డిసిప్లైన్

జపాన్ లో ఎక్కడైనా టికెట్ కౌంటర్ల ముందు ఎంత పొడవైన లైన్ ఉంటే.. గంటల తరబడి వెయిట్ చేస్తారే తప్ప లైన్ తప్పడం అనేది ఉండదు. 2011లో  సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా  ఫుడ్, వాటర్ కోసం జపనీస్ క్యూ పాటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఫారెస్ట్ బాతింగ్

జపనీస్ రెండు వారాలకొకసారైనా ఫారెస్ట్ బాతింగ్ చేస్తారు. అంటే అడవుల్లో లాంగ్ వాక్ చేయడం. నేచర్‌‌తో గడపడాన్ని వాళ్లు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దీంతోపాటు రోజూ ఉదయాన్నే తప్పకుండా కొంత వ్యాయామం చేస్తారు. పరుపులకు బదులు నేలపై పడుకోడాన్ని ఇష్టపడతారు. దీనివల్ల వాళ్లకు వెన్ను నొప్పి, నడుము నొప్పి లాంటివి రావు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..