- Telugu News Photo Gallery Just 2 Black Peppercorns: Unlock 6 Amazing Health Benefits, You Need To Know
Health Tips: అమేజింగ్.. రోజుకు కేవలం 2 మిరియాలతో ఈ రోగాలన్నింటికి చెక్.. లైట్ తీసుకున్నారో..
నల్ల మిరియాలు మన వంటగదిలో కేవలం రుచిని పెంచే మసాలా దినుసు మాత్రమే కాదు.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధం కూడా. ఆ మీ దినచర్యలో ప్రతిరోజూ కేవలం 2 నల్ల మిరియాలను చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలలో మెగ్నీషియం, రాగి, ఐరన్, కాల్షియం, పాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు, A, K, E, B గ్రూప్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.
Updated on: Oct 14, 2025 | 4:37 PM

జీర్ణవ్యవస్థ - మలబద్ధకం: ప్రతిరోజూ రెండు నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది పేగులను శుభ్రపరచడంలో, శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు మృదువుగా ఉండి, మలబద్ధకం, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు తగ్గి ఆకలి కూడా మెరుగుపడుతుంది.

నల్ల మిరియాలు రుచి ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోలేం. అయితే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల మిరియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

జలుబు, దగ్గుకు : జలుబు, దగ్గుకు నల్ల మిరియాలు ఒక శక్తివంతమైన సహజ నివారణ. పైపెరిన్ భాగం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది దగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే కఫాన్ని మృదువుగా చేసి శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది గొంతులో దురద, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

వంటగదిలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు ఒకటి. ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకోవడం వల్ల ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

చర్మాన్ని మెరుగుపరుస్తుంది: నల్ల మిరియాలలో ఉండే సహజ పదార్థాలు చర్మానికి మేలు చేస్తాయి. ఇది చర్మంలోని అదనపు బ్యాక్టీరియాను, మెలనిన్‌ను నియంత్రిస్తుంది. తద్వారా చర్మంపై మచ్చలు, సంబంధిత సమస్యలు తగ్గుతాయి. యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని సూక్ష్మక్రిముల నుండి రక్షించి, ప్రకాశవంతంగా మరియు మృదువుగా ఉంచుతాయి.

రోగనిరోధక శక్తి: మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. పైపెరిన్, యాంటీ-ఆక్సిడెంట్ భాగాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కేవలం రెండు మిరియాలు మీ దినచర్యలో ఒక చిన్న భాగం అయినప్పటికీ, అవి మీ ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయని గుర్తుంచుకోండి.




