Health Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ 6 పండ్లను తింటే విషంతో సమానం.. ఆ పండ్లు ఏమిటంటే

పండ్లలో అనేక రకాల పోషకాలున్నాయి. దీంతో పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పండ్లు తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. వేళగాని వేళలో పండ్లను తింటే అనారోగ్యాన్ని కలిగిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ 6 పండ్లను తింటే శరీరంలో విషంగా మారిపోతుంది. సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలో పండ్లను తినొద్దు. ఆ పండ్లు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Health Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ 6 పండ్లను తింటే విషంతో సమానం.. ఆ పండ్లు ఏమిటంటే
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2025 | 1:15 PM

పండ్లు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. పండు తినడానికి సరైన సమయం ఏది అనే విషయంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. అయితే పండ్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయనేది నిజం. అయితే రాత్రి వేళల్లో లేదా సాయంత్రం సమయంలో కొన్ని రకాల పండ్లను తినొద్దు. చాలా మంది రాత్రిపూట కూడా ఫ్రూట్ సలాడ్ తింటారు. ఆ సలాడ్ చేసేటప్పుడు ఈ పండ్లను కలప వద్దు. ఎందుకంటే శరీరానికి మేలు చేస్తుందని భావించి ఈ పండ్లను సాయంత్రం తినడం వలన.. విషంగా మారతాయని నిపుణులు పేర్కొన్నారు.

సూర్యాస్తమయం తర్వాత తింటే శరీరానికి హాని కలిగించే పండ్లు ఏమిటంటే

  1. పుచ్చకాయ: ఏడాది పొడవునా అందుబాటులో ఉన్నా.. వేసవిలో ఎక్కువగా మార్కెట్ లో లభించే పండు పుచ్చకాయ. అయితే దీనిని రాత్రి లేదా సాయంత్రం సమయంలో తినకూడదు. దీనిని తినడం వలన శరీరం చల్లబడుతుంది. రాత్రి సమయంలో తినడం వల్ల కడుపులో గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక పుచ్చకాయను పగలు తినడం మంచిది.
  2. ద్రాక్ష: ద్రాక్షలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని రాత్రి సమయంలో తింటే జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. కడుపు బరువుగా అనిపించవచ్చు. కనుక పగలు ద్రాక్ష పండ్లను తినడం మంచిది.
  3. అరటిపండు: రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు నిద్రకు భంగం కలిగించవచ్చు. మలబద్ధకం , గ్యాస్ సమస్యలకు కారణం కావచ్చు.
  4. కీర దోస: దీనిలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. కనుక దీనిని తినడం వలన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కనుక కీర దోసను రాత్రి సమయంలో తినడం వలన తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. ఫలితంగా నిద్రకు ఆటంకం కలుగుతుంది. కనుక కీర దోసను పగలు తినడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. మామిడిపండ్లు –  మామిడిపండ్లు వేసవి సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే వీటి మీద ఉన్న ఇష్టంతో కొంతమంది ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి అనే తేడా లేకుండా  తింటారు. రాత్రి మామిడి పండుని తినడం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది రాత్రిపూట జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రాత్రి మామిడి పండ్లను ఎక్కువగా తింటే కడుపు భారరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిద్ర సమస్య కలుగుతుంది.
  7. నారింజ పండు – ఇది సిట్రస్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. దీంతో రాత్రి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కనుక రాత్రి సమయంలో  నారింజ తినవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)