AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైలెంట్ కిల్లర్.. శరీరంలో ఈ 3 లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో పెను ప్రమాదంలో పడుతున్నట్లే

కొలెస్ట్రాల్ మన శరీరానికి ముఖ్యమైనది.. కానీ దాని పరిణామం అధికంగా పెరగడం ప్రమాదకరం.. ఈ ప్రమాదాన్ని ముందే పసిగడితే.. ప్రమాదకర జబ్బుల నుంచి బయటపడొచ్చు.. అధిక కొలెస్ట్రాల్ సంకేతాలను ఎలా గుర్తించాలి? మీ శరీరంలోని ఏ భాగాలు ప్రారంభ సంకేతాలను చూపిస్తాయి.. ఈ వివరాలను తెలుసుకోండి..

Shaik Madar Saheb
|

Updated on: Jan 01, 2025 | 1:38 PM

Share
సైలెంట్ కిల్లర్.. కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతుంది.. అయితే.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిణామం పెరగడం గుండె జబ్బుల బారిన పడేలా చేస్తుంది.. వాస్తవానికి కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చెడ్డది అని మనం అనుకుంటాము. అయితే కొలెస్ట్రాల్ ను మంచి, చెడు అని రెండుగా విభజిస్తారు..  ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL).. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను సృష్టించడానికి రక్తంలో మంచి కొలెస్ట్రాల్ అవసరం..

1 / 5
అయితే చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పరిమాణం పెరిగినప్పుడు, సిరలలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. చాలా సార్లు, అధిక కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టడానికి కూడా దారితీస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి, మీరు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించాలి. శరీరంలో కొన్ని నిర్దిష్ట సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోండి. కొలెస్ట్రాల్ పెరిగితే శరీరం కొన్ని హెచ్చరికల సంకేతం ఇస్తుంది.. అవేంటో తెలుసుకోండి..

2 / 5
అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల నేరుగా అధిక రక్తపోటుకు సంబంధించినది. రక్తంలో కొవ్వు ఎంత పెరిగితే రక్తపోటు అంత ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ కారణంగా రక్త సరఫరాలో అవరోధం ఏర్పడినప్పుడు, గుండెకు రక్తాన్ని పంప్ చేయడానికి ధమనులు చాలా కష్టపడాలి.

3 / 5
పాదలలో తిమ్మిరి: మీ పాదాలు మొద్దుబారడం ప్రారంభించినప్పుడు దానిని తేలికగా తీసుకోకండి.. అది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. అంటే ధమనుల ద్వారా రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉన్నట్లు అర్థం. దీని వల్ల పాదాల్లో నొప్పి రావడం, తిమ్మిరి, జలదరింపు వంటివి కనిపిస్తాయి.

4 / 5
గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు, మీ ధమనులలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది, సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. వేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల గోళ్ల రంగు లేత గులాబీ నుంచి పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్‌ను పెంచే ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించవద్దు.

5 / 5