ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పాలిచ్చే తల్లులకు అరటి మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
అరటి పండ్లే కాదు ..పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అరటి పువ్వులో ఉండే పోషకాలు నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి అరటి పువ్వు మేలు చేస్తుందట.
ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి ఇది పనిచేస్తుంది. అరటి పువ్వుతో చేసిన పదార్థాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి. ప్రతి రోజూ వంద మిల్లీ గ్రాముల అరటి పువ్వు రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తం శుద్ధి అయ్యేందుకు దొహదపడుతుంది. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు, కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పువ్వు మంచిదట.
అరటి పువ్వుని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పాలిచ్చే తల్లులకు అరటి మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..