AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పసుపు, అల్లం పొడిని కలిపి తీసుకుంటే.. శరీరంలో జరిగే మార్పులివే

పసుపు, అల్లం ఈ రెండింటికీ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంపొడి, పసుపు మిశ్రమాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే జరిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: పసుపు, అల్లం పొడిని కలిపి తీసుకుంటే.. శరీరంలో జరిగే మార్పులివే
Lifestyle
Narender Vaitla
|

Updated on: Nov 30, 2024 | 8:18 PM

Share

ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదాన్ని ఫాలో అవుతున్నాం. అనారోగ్య సమస్యలకు వంటింట్లో లభించే వస్తువులతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో అల్లం, పసుపు ఒకటి. వంటింట్లో కచ్చితంగా ఉపయోగించే ఈ రెండింటితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా పసుపును అల్లాని పొడి రూపంలోకి మార్చుకుని కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్న సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు. పసుపులో ఉండే కర్కుమిన్‌ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. దీంతో ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

పసుపు, అల్లంలో ఉండే విటమిన్ సి, విటమిన్ b6, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఈ, విటమిన్ కె వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడు పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్రపోషిస్తాయి. తరచూ వచ్చే వ్యాధులను తరిమికొట్టడంలో కూడా అల్లం, పసుపు బాగా ఉపయోగపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. పసుపు, అల్లం పొడిని కలిపి పాలలో కలుపుకొని తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు కూడా దూరమవుతాయి.

శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా పసుపు, అల్లం పొడి ఉపయోగపడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గడంతో రక్తపోటు తగ్గుతుంది. ఇక మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కూడా అల్లం, పసుపు పొడి బాగా ఉపయోగపడుతుంది. పసుపులోని కర్కుమిన్‌ సమ్మేళనం మెదడును కాపాడుతుంది. చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!