Viral Video: కార్తీక మాసం మహాత్యం.. శనిదేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన పిల్లి.. ఏం కోరుకుందో మరీ..!

ఏలినాటీ శని, అర్దష్టమ శని, శనిదోషాలతో బాధలు పడుతున్నవారు ఇక్కడకు తప్పకుండా వెళ్తుంటారు. శనీదేవుడికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటిది పిల్లి అదే పనిగా ప్రదక్షిణలు చేస్తునే ఉంది. ఇది పాత వీడియో అయినప్పటికీ తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Viral Video: కార్తీక మాసం మహాత్యం.. శనిదేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన పిల్లి.. ఏం కోరుకుందో మరీ..!
Cat Perform Parikrama
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 30, 2024 | 7:07 PM

అందరూ పూజ కోసం గుడికి వెళతారు. దేవుడి ముందు తలలు వంచి తమ కోరికలు నెరవేరాలని చేతులు జోడించి ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి చుట్టూ లేదంటే, ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ, ఏ జంతువైన ఇలాంటి పూజలు చేస్తూ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎప్పుడైనా చూశారా.. ? వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్‌ అవుతోంది. అందులో ఒక పిల్లి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.

వైరల్ అయిన వీడియోను చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. ఆలయంలో దేవుడి చుట్టూ తిరుగుతున్న పిల్లిని చూసి అందరూ చలించిపోయారు. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో MP_Wale (@mp_wallee) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో షేర్‌ చేయబడింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియో ప్రకారం.. ఇది మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలోని దృశ్యంగా తెలిసింది. ఈ పిల్లి ఐదు ప్రదక్షిణలు కాదు.. గంట, రెండు గంటలు అంతకంటే కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు నిరంతరంగా ఆలయంలో ప్రదక్షిణ చేసింది. ఒక పిల్లి మనుషులను చూసి భయపడి వెంటనే పారిపోయినా, ఈ పిల్లి మాత్రం మనుషులు దగ్గరికి వచ్చినా కూడా పారిపోకుండా తిరుగుతూనే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Madhya pradesh (@mp__wallee)

మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్ ఆలయం ఎంతో ప్రత్యేకత కల్గి ఉంటుంది. ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఇళ్లకు ద్వారాలు ఉండవు. ఇక్కడ చోరీలు జరుగవంటారు.. ఇక్కడ శనిదేవుడి ప్రత్యేకంగా వెలసి భక్తులకు కొంగు బంగారంగా మారాడని చెప్తుంటారు. అందుకే ఏలినాటీ శని, అర్దష్టమ శని, శనిదోషాలతో బాధలు పడుతున్నవారు ఇక్కడకు తప్పకుండా వెళ్తుంటారు. శనీదేవుడికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటారు.

ఇదిలా ఉంటే, ఈ వీడియో చాలా పాతది అంటున్నారు మరికొందరు నెటిజన్లు. కానీ, కార్తీక మాసం సందర్భంగా ఈ వీడియోని మరోమారు వైరల్ గా మార్చేశారని చెబుతున్నారు.  పిల్లి భక్తికి ఫిదా అవుతున్న ప్రజలు  లైకులు, షేర్లు చేస్తూ మళ్లీ తెరమీదకు తెచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..