పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్లే లేరా.?
రాజకీయ నాయకుల పాదయాత్రలు.. బస్సు యాత్రలను చూసుంటారు. తమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్, బైక్ యాత్రలను చూసుంటారు. కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా.. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలుపెట్టాడు. పవన్ కు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాడు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వివరించేందుకు యాత్ర చేపట్టినట్లు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది.. వ్యవసాయాన్ని నమ్ముకున్న యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని. యువ రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను అంటున్నాడు నవీన్. దీనికి ఒక్కటే పరిష్కారమని.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమని అన్నాడు. ఈ వివరాలు అన్నీ సమగ్రంగా పవన్ కళ్యాణ్‌కు వివరించేందుకు ఎద్దుల బండి యాత్ర చేపట్టినట్లు నవీన్ తెలిపాడు.
మొత్తం నెలరోజుల పాటు సాగే ఎద్దుల బండి యాత్రలో.. రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు యాత్ర చేపట్టి నెల రోజుల్లో అమరావతిలోని పవన్ కళ్యాణ్‌ను కలుస్తాను అంటున్నాడు. ఎద్దుల బండిలో తన తిండికి కావలసిన పదార్థాలు, సామాన్లతో పాటు.. దారిపొడవున వెళ్లే చోట ఎద్దుల కోసం రైతులను అడిగి పశుగ్రాసం తీసుకుంటున్నట్లు యువ రైతు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నేటి యువతకు, సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఎద్దుల బండి చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రైతుల సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఎద్దుల బండి యాత్ర చేస్తున్నానని చెప్పడం వరకు బాగానే ఉంది. యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని.. పెళ్లిళ్లు కావడం లేదని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాననడంతో.. వ్యవసాయం చేస్తున్న పెళ్లికాని ప్రసాదులకు యువ రైతు నవీన్ ఓ టార్చ్ బేరర్‌లా కనిపిస్తున్నాడట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.