Viral: పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల చేతికి ఒక్కసారి చిక్కామా? దాని నుంచి బయటపడటం అంత ఈజీ కాదంటారు. అప్పు తీసుకునే వరకు వెంటపడే ఫైనాన్స్ సంస్థలు.. ఇక ఆ తర్వాత అసలు సీన్ చూపిస్తుంటాయి. వడ్డీ, చక్రవడ్డీలను ముక్కు పిండి వసూలు చేస్తారు. డబ్బులు చెల్లించలేదంటూ ఇంటికి వచ్చి పరువు తీస్తుంటారు. డబ్బు కట్టేవరకు ఏజెంట్లు నిద్ర కూడా పోనివ్వరు.
ఫైనాన్స్ తీసుకున్నవాళ్లు ఏజెంట్ల టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఓ యువకుడు ఏజెంట్లు పెట్టే ఇబ్బందులు భరించలేక వారి కళ్ల ముందే తన బైకును తగలబెట్టేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుని టూవీలర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐ పద్దతిలో డబ్బులు తిరిగి చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు చెల్లించింది పోగా ఇంకో ఐదు నుంచి ఆరు వేల బకాయి మిగిలి ఉంది. ప్రతిసారి ఈఎంఐ డబ్బుల కోసం ఫైనాన్స్ ప్రతినిధులు ఇంటికి వస్తుండటంతో ఆ యువకుడు మనోవేదనకు గురయ్యాడు. మిగిలిన బకాయి కోసం ఫైనాన్స్ ప్రతినిధులు శనివారం ఇంటికి రాగా, వారి ముందే బైక్కు నిప్పంటించాడు. అది పూర్తిగా కాలిపోయింది. ఫైనాన్స్ వాళ్ళు పెట్టే వేధింపులు భరించలేకనే బైక్ ను తగలబెట్టినట్లు తెలుస్తోంది. కాగా ,ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.