షుగర్ పేషెంట్స్ పింక్ జామ తింటే ఏమౌతుందో తెలుసా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
అలాంటి జామపండులో రెండు రకాలు ఉన్నాయి. తెలుపు, గులాబీ రెండు రకాలు ఉంటాయి. అయితే, డయాబెటిక్ బాధితులు పింక్ జామకాయ తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..
సంపూర్ణ ఆరోగ్యానికి పండ్లు మంచి పోషకాహారం అని మనందరికీ తెలుసు. పండ్లలో ముఖ్యంగా జామకాయ గురించి చెప్పుకోవాలి. జామకాయను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. జామకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. జామకాయ పోషకాల పవర్ హౌస్. అలాంటి జామపండులో రెండు రకాలు ఉన్నాయి. తెలుపు, గులాబీ రెండు రకాలు ఉంటాయి. అయితే, డయాబెటిక్ బాధితులు పింక్ జామకాయ తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..
పింక్ జామలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర, కార్బస్ , విటమిన్ సి తక్కువగా ఉంటాయి. దీనికి గింజలు కూడా తక్కువ. తెల్లజామలో చక్కెర, స్టార్చ్, విటమిన్ సి, విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల జామలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పింక్ జామలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. గులాబి జాయకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పింక్ జామకాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. పింక్ జామకాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పింక్ జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది.
పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పింక్ జామకాయల్లో కేలరీలు తక్కువ,ఫైబర్ పుష్కలం. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి , వృద్ధాప్య చాయలను తగ్గించడానికి సహయపడుతుంది. గులాబి జామలో ఉండే ఫైబర్ , నీటి కంటెంట్ డయాబెటిస్ ఉన్న వారికి అద్భుతమైన పండుగా పనిచేస్తోంది. రక్తంలో గ్లూకోజ్‌తో వచ్చే చిక్కులను నివారించడంలో సహాయపడుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..