Palak Egg Curry: పాలకూర ఎగ్ కర్రీ.. కాంబినేషన్ అదుర్స్!
కోడి గుడ్లతో ఎప్పుడూ ఒకే లాంటి వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త వెరైటీగా తినాలి అనుకునేవారు.. ఇలా పాలక్ ఎగ్ కర్రీ చేయండి. పాలక్‌తో ఇతర కూరగాయలు కలిపి తినే ఉంటారు. ఒకసారి కోడి గుడ్లతో కలిపి చేస్తే.. చాలా రుచిగా ఉంటాయి..

కోడి గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటాం. కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాల పోషకాలు చక్కగా అందుతాయి. అయితే కోడి గుడ్లతో ఎప్పుడూ ఒకే లాంటి వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త వెరైటీగా తినాలి అనుకునేవారు.. ఇలా పాలక్ ఎగ్ కర్రీ చేయండి. పాలక్‌తో ఇతర కూరగాయలు కలిపి తినే ఉంటారు. ఒకసారి కోడి గుడ్లతో కలిపి చేస్తే.. చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కర్రీ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ పాలక్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
కోడి గుడ్లు, పాలకూర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర.
పాలక్ ఎగ్ కర్రీ తయారీ విధానం:
ముందుగా కోడి గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఒక పాన్ తీసుకుని అందులో పాలకూర వేసి నీరు ఇగిరేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన పాలకూర చల్లారాక మిక్సీలో వేయండి. అందులోనే పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. అందులో కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేయండి.
ఉల్లి ముక్కలు రంగు మారాక టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. టమాటాలు మెత్తబడ్డాక పాలకూర పేస్ట్ వేయాలి. ఆ తర్వాత ఇందులోనే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీరు వేసి అంతా దగ్గర ఉడికేంత వరకు ఉడికించాలి. ఈ టైమ్‌లో గుడ్లను సగం ముక్కలుగా కోసి.. చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పాలకూర కోడి గుడ్డు కర్రీ సిద్ధం.








