Green Tea Vs Lemongrass Tea: గ్రీన్ టీ Vs లెమన్ గ్రాస్ టీ.. ఏది తాగితే త్వరగా బరువు తగ్గుతారు?
ప్రస్తుతం చాలా మంది స్థూల కాయంతో ఇబ్బంది పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా.. అందరికీ శరీర బరువు అనేది పెరుగుతుంది. ఓవర్ వెయిట్ కారణంగా అతి తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో రకాల వ్యాయామాలు, ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీలను కూడా తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల సులభంగానే..

ప్రస్తుతం చాలా మంది స్థూల కాయంతో ఇబ్బంది పడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా.. అందరికీ శరీర బరువు అనేది పెరుగుతుంది. ఓవర్ వెయిట్ కారణంగా అతి తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో రకాల వ్యాయామాలు, ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీలను కూడా తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల సులభంగానే వెయిట్ లాస్ అవుతారని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఇవి తాగడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది తాగితే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ తాగడం వల్ల..
గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కెఫీన్‌తో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ టీ తాగడం వల్ల మెటాబాలిజం పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీలో ఉండే కొన్ని ఔషధ గుణాలు.. శరీరంలోని కొవ్వును కరిగించే ఎంజైమ్‌లను రిలీజ్ చేస్తుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గొచ్చు. దీంతో పాటు జీర్ణ క్రియ సమస్యలు కూడా ఈజీగా క్లియర్ అవుతాయి. గ్రీన్ టీ తాగితే.. ఆకలి కూడా నియంత్రణ అవుతుంది. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
లెమన్ గ్రాస్ టీ:
శరీరంలోని వాపులను తగ్గించడంలో లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల చక్కగా సహాయ పడుతుంది. అంతే కాకుండా శరీర బరువు కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో జీర్ణక్రియను మెరుగు పరిచే గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి కూడా సహాయ పడుతుంది. ప్రతి రోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే.. దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరం అవుతాయి.
ఈ రెండింటిలో ఏది బెస్ట్:
లెమన్ గ్రాస్ టీ, గ్రీన్ టీ ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. కొవ్వు కూడా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే లెమన్ గ్రాస్ టీతో కూడా ఆరోగ్యం మెరుగు పడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








