Sugar Control Tips: తీపి ఎక్కువగా తినాలనిపిస్తుందా.. అయితే ఈ ఫుడ్స్‌తో కంట్రోల్ చేయండి..
ప్రస్తుతం కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఈ షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. తగ్గించడం చాలా కష్టం. ఈ డయాబెటీస్‌ని కంట్రోల్ చేయడానికి సరైన మెడిసిన్ కూడా అందు బాటులో లేదు. కేవలం ఆహారంతో మాత్రమే దీన్ని తగ్గించుకోవాలి. డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీపి ఎక్కువగా తినాలన్న కోరిక పుడుతుంది. ఇలా తినడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే సాధారణంగా కూడా కొంత మందికి..

ప్రస్తుతం కాలంలో చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఈ షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. తగ్గించడం చాలా కష్టం. ఈ డయాబెటీస్‌ని కంట్రోల్ చేయడానికి సరైన మెడిసిన్ కూడా అందు బాటులో లేదు. కేవలం ఆహారంతో మాత్రమే దీన్ని తగ్గించుకోవాలి. డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీపి ఎక్కువగా తినాలన్న కోరిక పుడుతుంది. ఇలా తినడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే సాధారణంగా కూడా కొంత మందికి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి. వెంటనే స్వీట్లు గుర్తుకు వచ్చేస్తాయి. అయితే ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బెర్రీలు:
మార్కెట్లో ప్రస్తుతం బెర్రీల జాతికి సంబంధించి ఎన్నో రకాల పండ్లు లభిస్తున్నాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బ్రీస్ ఇలా చాలా రకాలు ఉంటున్నాయి. వీటిల్లో ఏదో ఒకటి తరచూ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇవి తరచూ తింటే వెయిట్ లాస్ కూడా అవుతారు.
పెరుగు:
మన ఇంట్లో పెరుగు ప్రతి రోజూ ఉంటుంది. ప్రతి రోజూ కప్పు పెరుగు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల చక్కెర తినాలన్న కోరికలు చాలా వరకూ తగ్గుతాయి. పెరుగులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తింటే ఇంకా మంచిది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకుని తిన్నా బెటరే. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే.. చర్మం, జుట్టు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
డార్క్ చాక్లెట్:
సాధారణ చాక్లెట్ల కంటే.. డార్క్ చాక్లెట్లు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి తింటే ఒత్తిడి, ఆందోళన వంటివి కంట్రోల్ అవడమే కాకుండా భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. అంతే కాకుడా తీపి తినాలన్న కోరికలను చాలా వరకూ తగ్గిస్తుంది. ఇంకా దాల్చిన చెక్క, అవకాడో, నట్స్ వంటివి వాటిని తిన్నా షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








