Blood Donation Benefits: రక్తం దానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట..
రక్త దానం గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. రక్త దానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రక్త దానం అనేది ప్రతీ ఒక్కరూ చేయాల్సిన సామాజిక బాధ్య. రక్తం సరైన సమయంలో అందక పోవడం వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రక్త దానంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏడాది కేవలం 10 శాతం మంది మాత్రమే రక్తం దానం చేస్తున్నారు. రక్త దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని..

రక్త దానం గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. రక్త దానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రక్త దానం అనేది ప్రతీ ఒక్కరూ చేయాల్సిన సామాజిక బాధ్య. రక్తం సరైన సమయంలో అందక పోవడం వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రక్త దానంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏడాది కేవలం 10 శాతం మంది మాత్రమే రక్తం దానం చేస్తున్నారు. రక్త దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, బలహీనంగా మారుతారని అందరికీ ఓ అపోహ ఉంది. కానీ తప్పుడు అపోహ మాత్రమే. నిజానికి రక్త దానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రక్త దానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది:
రక్త దానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. సాధారణంగా రక్తంలో ఎక్కువ ఐరన్.. రక్త ధమనులను అడ్డుకుంటుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇది హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి కారణం అవుతుంది. రక్త దానం చేయడం వల్ల ఐరన్ నిల్వలు అనేవి తగ్గుతాయి. దీంతో ధమనులు చక్కగా పని చేస్తాయి. దీంతో గుండె పోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.
క్యాన్సర్లు రాకుండా ఉంటాయి:
రక్తంలో ఐరన్ అనేది అధికంగా ఉంటుంది. దీని వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే తరచూ రక్త దానం చేయడం వల్ల.. రక్తంలో ఐరన్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.
బరువు తగ్గుతారు:
రక్త దానం చేయడం వల్ల బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంది. హెల్దీగా ఉండే వ్యక్తు రక్త దానం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. శక్తిని పెంచుకునేందుకు ఉపయోగ పడుతుంది. అయితే రక్త దానం చేసేముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు.
రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది:
శరీరంలో అనేక రకాల వ్యాధులను నివారించడానికి రోగ నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని మెరుగు పరచాలన్నా, వ్యాధులు రాకుండా ఉండాలన్నా.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. తరచుగా రక్త దానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి వ్యవస్థను పునరుద్ధరించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








