Tofu For Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు జున్ను తినాలా? టోఫు తినాలా? వీటిల్లో ఏది మంచిది..
మీరు ఎప్పుడైనా టోఫు తిన్నారా? తిన్నవారికి ఈ పేరు పెద్దగా తెలియనిది కాదు. జున్నుకు ప్రత్యామ్నాయంగా శాఖాహారం తినాలనుకునే వారికి టోఫు మంచి ఎంపిక. కానీ చాలా మందికి జున్ను, టోఫు మధ్య తేడా తెలియదు. ఈ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండింటితో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. జున్నును ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. సోయా మిల్క్ టోఫు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ..
Updated on: Mar 12, 2024 | 8:41 PM

మీరు ఎప్పుడైనా టోఫు తిన్నారా? తిన్నవారికి ఈ పేరు పెద్దగా తెలియనిది కాదు. జున్నుకు ప్రత్యామ్నాయంగా శాఖాహారం తినాలనుకునే వారికి టోఫు మంచి ఎంపిక. కానీ చాలా మందికి జున్ను, టోఫు మధ్య తేడా తెలియదు. ఈ రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండింటితో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

జున్నును ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. సోయా మిల్క్ టోఫు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ పోషకాల విషయానికొస్తే ఏది బెస్ట్ అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

చీజ్ (జున్ను) - టోఫు రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ టోఫులో చీజ్ కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు టోఫును ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే, రెండింటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. శాఖాహారులు జున్ను నుంచి ప్రోటీన్ సులువుగా పొందవచ్చు. టోఫు కంటే చీజ్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. చీజ్ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

చాలా మంది జున్నులో కేలరీలు తక్కువగా ఉంటాయని అనుకుంటారు. దీనిలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ టోఫులో జున్ను కంటే తక్కువ కేలరీలు ఉంటాయి.

కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, మీ ఆహారంలో చీజ్ కట్ చేసి, టోఫు చేర్చుకోవడం మంచిది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు. కానీ టోఫు ప్రతిరోజూ తినకూడదు. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. పౌష్టికాహారం ఉన్న ఏ ఆహారాన్నైనా అతిగా తినకూడదు.




