Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. 380 వేసవి ప్రత్యేక రైళ్లు.. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు.. రూట్లు ఇవే..
సాధారణంగా వేసవి అనగానే రైళ్లు చాలా రద్దీగా మారిపోతుంటాయి.. అటువంటి రైళ్లలో ప్రయాణం కొంచెం కష్టమే. అందుకే రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 380 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.
పిల్లలకు సెలవులు అయిపోతున్నాయి. ఇంకో రెండు వారాల్లో మళ్లీ స్కూళ్లు, కాలేజీలు, డ్యూటీలు, ఆఫీసులు వగైరా హాడావుడి మొదలవుతుంది. ఇక జీవితం షరామామూలే అన్నట్లు అయిపోతుంది. అందుకే ఈ సెలవులు పూర్తయ్యేలోపే ఎంచక్కా ఎక్కడికైనా వెళ్లి రావాలని చాలా మంది భావిస్తారు. కుటుంబాలు, స్నేహితులు అందరూ కలిసి వెళ్దామని ప్లాన్ చేస్తుంటారు. కొంతమంది లాంగ్ టూర్లు కూడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ రైలు. రైలులో కుటుంబాలుగా, స్నేహితులతో లాంగ్ జర్నీ చాలా మంచి అనుభూతినిస్తోంది. సాధారణంగా వేసవి అనగానే రైళ్లు చాలా రద్దీగా మారిపోతుంటాయి.. అటువంటి రైళ్లలో ప్రయాణం కొంచెం కష్టమే. అందుకే రైల్వే శాఖ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 380 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుకుంటూ ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
380 రైళ్లు.. 6,369 ట్రిప్పులు..
రైల్వేశాఖ ప్రకటించిన 380 ప్రత్యేక రైళ్లు దేశంలోని ప్రధాన నగరాలైన పాట్నా, ఢిల్లీ, విశాఖపట్నం, ముంబై ల మీదుగా 6,369 ట్రిప్పులను వేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాది సమ్మర్ సీజన్‌లో 348 ప్రత్యేక రైళ్లతో 4,599 ట్రిప్పులను నడపగా.. ఈ ఏడాది అదనంగా 1,770 ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత వేసవిలో ఒక్కో రైలుకు సగటున 13.2 ట్రిప్పులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 16.8గా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఒక్కో రైలులోని జనరల్ బోగిలో 100 ప్రయాణికులు కూర్చోవచ్చని, అదే స్లీపర్ క్లాస్ అయితే 72 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
ప్రత్యేక రైళ్లు ఇలా..
అన్ని జోన్లను కలుపుకుంటూ ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఓడిశా, వెస్ట్ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల గుండా ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణిస్తాయి. పాట్నా – సికింద్రాబాద్, పాట్నా – యశ్వంత్‌పూర్, బరౌనీ – ముజఫర్‌పూర్, ఢిల్లీ – పాట్నా, ఢిల్లీ – కత్రా, చండీగఢ్ -గోరఖ్‌పూర్, ఆనంద్ విహార్ -పాట్నా, విశాఖపట్నం -పూరీ- హౌరా, ముంబై- పాట్నా, ముంబై-గోరఖ్‌పూర్ మధ్య నడవనున్నాయి.
ఏ జోన్ కి ఎన్ని ట్రిప్పులు అంటే..
రైల్వే శాఖ చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది సౌత్ సెంట్రల్ రైల్వే 784 ట్రిప్పులను నడుపుతోంది, ఇది గత సంవత్సరం కంటే 80 ట్రిప్పులు ఎక్కువ. నార్త్ వెస్ట్రన్ రైల్వే 400 ట్రిప్పులను నడుపుతోంది, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 380 ట్రిప్పులను నడుపుతోంది. నార్త్ రైల్వే కూడా ఈ ఏడాది 324 ట్రిప్పులను నడపాలని ప్లాన్ చేసింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..