- Telugu News Photo Gallery Relationship Tips: don't make these mistakes after a fight between husband and wife
Relationship Tips: భార్యాభర్తలకు అలర్ట్.. ఇలాంటి తప్పులు చేస్తే కాపురంలో మంటలే.. బీకేర్‌ఫుల్..
ప్రస్తుతం బంధాలు బలహీనంగా మారుతున్నాయి. చిన్నపాటి గొడవలు పెద్దవిగా మారడం నుంచి మొదలుపెడితే.. పలు విషయాలు భార్య భర్తల మధ్య మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో చాలామంది బంధాలను తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తున్నారు. అయితే, భార్యభర్తల మధ్య గొడవలు సహజం.. అందుకే ఉదయం లేచినప్పటి నుంచి.. నిద్రపోయే వరకు భార్యాభర్తలు గొడవ పడతారని సామెత. ఈ పోరు ఇలాగే కొనసాగితే కుటుంబంలో గందరగోళం నెలకొంటుందని చెప్పవచ్చు.
Updated on: May 21, 2023 | 9:42 PM

ప్రస్తుతం బంధాలు బలహీనంగా మారుతున్నాయి. చిన్నపాటి గొడవలు పెద్దవిగా మారడం నుంచి మొదలుపెడితే.. పలు విషయాలు భార్య భర్తల మధ్య మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో చాలామంది బంధాలను తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తున్నారు. అయితే, భార్యభర్తల మధ్య గొడవలు సహజం.. అందుకే ఉదయం లేచినప్పటి నుంచి.. నిద్రపోయే వరకు భార్యాభర్తలు గొడవ పడతారని సామెత. ఈ పోరు ఇలాగే కొనసాగితే కుటుంబంలో గందరగోళం నెలకొంటుందని చెప్పవచ్చు. అయితే, ఇద్దరూ అర్ధం చేసుకుంటే దానిలో ఉండే మజానే వేరంటున్నారు ఆరోగ్య, మానసిక నిపుణులు..

అద్దం పగిలితే దాన్ని మళ్లీ సరిచేయలేము.. రిలేషన్ షిప్ అలాంటిదే. ఒకసారి బంధంలో తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తితే.. దాన్ని రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో బంధాల విలువలను చాలామంది అర్దం చేసుకోవడం లేదు.. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి.. తెగదెంపుల వరకు వెళ్లడం కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఏదైనా సంబంధానికి హెచ్చు తగ్గులు ఉంటాయి. భార్యాభర్తల బంధం మినహాయింపు కాదు. చాలా సార్లు ఈ గొడవలు చాలా తీవ్రంగా మారుతాయి. దీంతో భార్యాభర్తలు సింపుల్ గా విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అలాంటి సందర్భంలో భార్యాభర్తలు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే.. కొన్ని సంఘటనలను నివారించవచ్చు.

మొదటి పెద్ద తప్పు ఏమిటంటే, గొడవ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం చాలా తప్పు. తగాదా తర్వాత, ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఎవరి తప్పుతో సంబంధం లేకుండా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి.

మీకు గొడవ జరిగినప్పుడు సోషల్ మీడియాలో స్టేటస్ పోస్ట్ చేయడం లాంటి తప్పులు ఎప్పుడూ చేయవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమణిగేలా మూడో వ్యక్తి మధ్యలోకి రాకూడదు. ఎందుకంటే వారు సమస్యను పరిష్కరించలేరు. ఇది కాస్త మరింత పెరిగడానికి దోహదపడుతుంది.

గొడవ జరిగిన తర్వాత.. అది ప్రారంభించిన అంశంపై ఇద్దరూ చర్చించి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా చేస్తే.. గొడవలు దూరమై సంబంధం మునుపటిలాగే కొనసాగుతుంది. అయితే, బంధం ప్రేమ, నమ్మకం, విశ్వాసం లాంటి అంశాలపై ముడిపడి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.




