వామ్మో.. ఇదెప్పుడైనా ఆలోచించారా..? 24 గంటలు ఆహారం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
ఆకలితో ఉండటం భరించలేని అనుభవం మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం.. అందుకే సరైన సమయంలో అల్ఫాహారం తీసుకోవడం.. మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా గంటలపాటు మనం ఆహారం తినకపోతే.. మన కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎక్కువ ఆలస్యం అయితే, మనకు ఏ పని చేయాలని అనిపించదు.
ఆకలితో ఉండటం భరించలేని అనుభవం మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి చాలా హానికరం.. అందుకే సరైన సమయంలో అల్ఫాహారం తీసుకోవడం.. మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా గంటలపాటు మనం ఆహారం తినకపోతే.. మన కడుపులో ఎలుకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎక్కువ ఆలస్యం అయితే, మనకు ఏ పని చేయాలని అనిపించదు. దీంతో మనచూపు ఆహారం వైపు మళ్లుతుంది. ఏది దొరికితే అది తినాలనిపిస్తుంది. అయితే.. 24 గంటలకు పైగా ఆకలితో ఉంటే.. మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. చివరకు ఏమి జరుగుతుంది..? అని ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
మానసిక ఆరోగ్యంపై ప్రభావం..
రోజంతా ఆకలితో ఉండడం మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అజాగ్రత్త, అలసట, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది మన జీవిత నాణ్యతను మార్చగలదు.. మంచి సామాజిక, వృత్తిపరమైన జీవిత సమతుల్యతను దెబ్బతీస్తుంది.
వ్యక్తిత్వంపై ప్రభావం..
మీకు 24 గంటలు ఆహారం లభించనప్పుడు, మీరు సాధారణ పరిస్థితుల్లో లాగా ప్రవర్తించలేరు. అటువంటి పరిస్థితిలో వ్యక్తులతో మీ ప్రవర్తన ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిత్వంలో మార్పును అనుభవిస్తారు.
జీర్ణ సమస్యలు..
ఎక్కువ కాలం ఆకలితో ఉండడం వల్ల ఎసిడిటీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్, పొత్తికడుపులో వ్యాకోచం వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. ఇది మీ కడుపులో అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. మీ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
పని సామర్థ్యంపై ప్రభావం..
రోజంతా ఆకలితో ఉండడం వల్ల మీ దృష్టి మరల్చడంతోపాటు ఏకాగ్రత సామర్థ్యం తగ్గుతుంది. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా తగ్గించవచ్చు. మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
శక్తి లేకపోవడం..
ఎక్కువ సేపు ఆకలితో ఉండడం వల్ల మీ శరీరానికి పూర్తి శక్తి ఉండదు. దీని వల్ల మీ కండరాలు అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు బలహీనంగా మారతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి