ఆ లోపం ఉంటే.. మీ శరీరంలో ఈ విటమిన్ లేనట్లే.. బీకేర్‌ఫుల్ బ్రో..

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం.. ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు లభిస్తుంది. అయినప్పటికీ ఇది కొన్ని ఆహారాలను తినడం ద్వారా కూడా పొందవచ్చు. ఈ ముఖ్యమైన పోషకం లోపం ఉంటే, మన ఎముకల్లో నొప్పులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు, ఫ్లూ తదితర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ డి వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.. లోపం ఉంటే దాని లక్షణాలను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

ఆ లోపం ఉంటే.. మీ శరీరంలో ఈ విటమిన్ లేనట్లే.. బీకేర్‌ఫుల్ బ్రో..
Vitamin D Deficiency
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 11, 2024 | 1:29 PM

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం.. ఇది సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు లభిస్తుంది. అయినప్పటికీ ఇది కొన్ని ఆహారాలను తినడం ద్వారా కూడా పొందవచ్చు. ఈ ముఖ్యమైన పోషకం లోపం ఉంటే, మన ఎముకల్లో నొప్పులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు, ఫ్లూ తదితర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ డి వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.. లోపం ఉంటే దాని లక్షణాలను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

విటమిన్ డి ప్రయోజనాలు:

విటమిన్ డి శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ డి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో విటమిన్ డి సహకరిస్తుంది.

శరీరంలో విటమిన్లు పుష్కలంగా ఉన్నప్పుడు, ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. డయాబెటిక్ పేషెంట్లకు విటమిన్ డి కూడా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. విటమిన్ డి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ అవయవాలను బలంగా చేస్తుంది.

విటమిన్ డి శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

విటమిన్ డి లోపం లక్షణాలు:

మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య పరీక్షల ద్వారా ఈ సమస్యను గుర్తించగలిగినప్పటికీ, మన శరీరం ద్వారా కూడా కొన్ని సూచనలు కనుగొనవచ్చు.

విటమిన్ డి లోపం వల్ల గాయాలు నెమ్మదిగా మానుతాయి.

మీరు డిప్రెషన్, ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

కండరాలలో నొప్పి ఉంటే అది విటమిన్ డి లోపం లక్షణం..

విటమిన్ డి లోపం వల్ల రోజంతా నీరసంగా, సోమరితనంగా అనిపిస్తుంది.

విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో నొప్పి మొదలవుతుంది.

మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే లేదా తెల్లగా మారితే ఇవి విటమిన్ డి లోపానికి సంకేతాలు.

రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీరు త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి