AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Juice Benefits: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగిస్తే ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

శీతాకాలం ప్రవేశించిందంటేనే అనేక రకాల సీజనల్ ఆరోగ్య సమస్యలు వెంటాడడం ప్రారంభిస్తాయి. చర్మ, కేశ సమస్యలనేవి ఈ కాలంలో సర్మసాధరణమైన సమస్యలు. అలాగే చలికాలంలో శరీరం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణాన్ని

Carrot Juice Benefits: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగిస్తే ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Carrot Juice Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 24, 2023 | 8:49 PM

శీతాకాలం ప్రవేశించిందంటేనే అనేక రకాల సీజనల్ ఆరోగ్య సమస్యలు వెంటాడడం ప్రారంభిస్తాయి. చర్మ, కేశ సమస్యలనేవి ఈ కాలంలో సర్మసాధరణమైన సమస్యలు. అలాగే చలికాలంలో శరీరం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణాన్ని తట్టుకునే శక్తి పోషకాహారం తీసుకోవడం ద్వారానే శరీరానికి లభిస్తుంది. ఇక శీతకాలంలో లభించే పలు రకాలైన కూరగాయలను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల పలు విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి అలాంటి కూరగాయలలో లేదా జ్యూస్‌లలో చెప్పుకోదగినది క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ పోషకాలతో నిండి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మరి క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

  1. రోగ నిరోధక శక్తి: శీతాకాలంలొో ప్రతి రోజూ ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరాన్ని ప్రీ రాడికల్స్ డ్యామెజ్ నుంచి రక్షించడమే కాక, హానికర బ్యాక్టిరియా, వైరస్ ల నుంచి రక్షణ పొందడానికి సాయం చేస్తుంది. 
  2. చర్మ సమస్యలు: క్యారెట్ ఉండే బీటా కొరిటిన్ అనేది విటమన్ ఏ కు సంబంధించింది. దీని యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు కణజాల పునర్నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ క్యారెట్ జ్యూస్ లో ఉండే అధిక ఫైబర్ కారణంగా మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు.
  3. బ్లడ్ షుగర్ నియంత్రణ: బ్లడ్ షుగర్ తో బాధపడేవారు తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ తగిన మొత్తంలో మెయిన్ టెయిన్ అవుతాయి. క్యారెట్ లో ఉండే క్యాలరీలు, విటమిన్లు, మినరల్స్ మధుమేహాన్ని నిరోధించడానికి పోరాడతాయి. 
  4. గుండె జబ్బులు: క్యారెట్ జ్యూస్ లో ఉండే బీటా కోరెటిన్ గుండె జబ్బులకు దారితీసే ప్రీ రాడికల్స్ పోరాడానికి చాలా అవసరం. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి, ఇ, అలాగే ఫోలెట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా చెడు ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ జరగకుండా తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. 
  5. ఇవి కూడా చదవండి
  6. కంటి చూపు: కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కంటి సమస్యలు, రేచీకటి వంటి సమస్యలకు మూల కారణం విటమిన్ ఏ లోపమే. కాబట్టి ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపునకు మంచిదని నిపుణులు చెబుతున్నారు .

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..