AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆహారాలు తినడంలో పొరపాటు చేస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిందే..! ప్రపంచంలో ప్రమాదకరమైన ఫుడ్స్‌

Dangerous Foods: ప్రతి దేశానికి సొంత ఆహార పద్దతులు ఉంటాయి. వాటిని ఎలా తినాలో వారికి తెలుసు. అయితే కొన్ని దేశాల ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి.

ఈ ఆహారాలు తినడంలో పొరపాటు చేస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిందే..! ప్రపంచంలో ప్రమాదకరమైన ఫుడ్స్‌
Dangerous Food
uppula Raju
|

Updated on: Nov 19, 2021 | 5:59 AM

Share

Dangerous Foods: ప్రతి దేశానికి సొంత ఆహార పద్దతులు ఉంటాయి. వాటిని ఎలా తినాలో వారికి తెలుసు. అయితే కొన్ని దేశాల ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని తినడంలో పొరపాటు జరిగితే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే కొందరు వాటిని తినడం మానేస్తారు. కానీ ఈ వంటకాల రుచి వారిని విడిచిపెట్టదు. అలాంటి కొన్ని ప్రమాదకరమైన ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ఫుగు (పఫర్ ఫిష్) ఫుగు (పఫర్ ఫిష్) ఒక జపనీస్ వంటకం. ఇది జపాన్‌కు చెందిన చాలా విషపూరితమైన చేప. ఈ చేపను వండేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో విఫలమైన చెఫ్‌కి ఈ వంటకం చేయడానికి లైసెన్స్ లభించదు. ఎందుకంటే వండటంలో ఏదైనా తప్పు జరిగితే మనిషి ప్రాణం పోతుందని అంటారు.

2. క్లామ్స్ చైనాలో బ్లడ్ క్లామ్స్ సాధారణంగా తింటారు. ఈ బ్లడ్ క్లామ్ డిష్ తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీన్ని తినడంలో పొరపాటు జరిగితే టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

3. కిడ్నీ బీన్స్ ఎరుపు రంగులో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్‌లో చాలా విషపూరితాలు ఉంటాయి. నాలుగైదు పచ్చి కిడ్నీ బీన్స్ తింటే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. పచ్చి కిడ్నీ బీన్స్ తినడం కంటే తక్కువగా ఉడికించిన కిడ్నీ బీన్స్ తినడం చాలా హానికరం.

4. వేయించిన బ్రెయిన్ శాండ్‌విచ్ ఈ శాండ్‌విచ్‌ని ఆవు లేదా దూడ మెదడు నుంచి తయారు చేసినట్లు చెబుతారు. ఇందులో మెదడును వేయించి వడ్డిస్తారు. ఈ వంటకం అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ దాని దుష్ప్రభావాల కారణంగా నిషేధించారు.

5. పక్షుల గూడు సూప్ మీరు ఎప్పుడైనా పక్షుల గూడు సూప్ గురించి విన్నారా? కానీ ఈ సూప్ కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే పురాతనమైనది. అత్యంత ఖరీదైనది కూడా. ఒక కప్పు పక్షి గూడు సూప్ సుమారు $10,000 ఖర్చవుతుంది.

6. పచ్చి జీడిపప్పు జీడిపప్పును అందరూ ఇష్టపడతారు. ప్రజలు ఫిట్‌నెస్ కోసం జీడిపప్పును తీసుకుంటారు కానీ పచ్చి జీడిపప్పు తినడం మీకు హానికరం. ఉరుషియోల్ అనే మూలకం ఇందులో ఉంటుంది ఇది చాలా ప్రాణాంతకం.

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..