Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినాల్సిందే.. అవేంటంటే?

మధుమేహ వ్యాధిగ్రస్తులు నిజంగా పండ్లకు దూరంగా ఉండాలా? వద్దా? అనే విషయంపై విభిన్న మాటలు వినిపిస్తుంటాయి.

Diabetes: షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే ఈ 7 పండ్లు తినాల్సిందే.. అవేంటంటే?
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2021 | 9:32 PM

Diabetes: భారతదేశంలో మధుమేహం కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే, వారి బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి ఇవి తినండి, వాటిని తినవద్దు లాంటి సూచనలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పండ్ల గురించి మాట్లాడుతూ వాటికి దూరంగా ఉండాలనే సలహా అందరి నుంచి వినిపిస్తోంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు నిజంగా పండ్లకు దూరంగా ఉండాలా? వద్దా? అనే విషయంపై విభిన్న మాటలు వినిపిస్తుంటాయి.

కొన్ని జాగ్రత్తలతో పండ్లు తినొచ్చు..! అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు మనల్ని ఛార్జ్ చేయడమే కాకుండా, రక్తంలో చక్కెరను నియంత్రించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అదే సమయంలో పండ్ల విషయంలో ఉన్న గందరగోళాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారంపై శ్రద్ధ పెడితే, టైప్ 1, టైప్ 2, ప్రిడయాబెటిస్ నుంచి బయటపేడేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంటుందని అంటున్నారు.

పండ్లను నమిలి తినడం చాలా ముఖ్యం.. పండ్లను నమిలిన తర్వాతే తినాలని డాక్టర్లు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు పండ్ల రసాలను, టెట్రా ప్యాకెట్లలో ఉన్న జ్యూస్‌లను తాగేందుకు ఇష్టపడరు. ఎందుకంటే పండును నమిలి తిన్నప్పుడు మాత్రమే అందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు శరీరంలోకి వెళ్తాయి. అలాగే, పండ్లు తినడం ద్వారా వాటిలో ఉన్న చక్కెర శరీరంలో నెమ్మదిగా కరుగుతుంది. జ్యూసులు తాగడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు యాపిల్, పియర్, జామ, ద్రాక్ష, నారింజ, కివీ, దానిమ్మ పండ్లు తినాలి. ఈ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. నిజానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా ఏ ఆహార పదార్థం తిన్నా రెండు గంటల తర్వాత శరీరంలో షుగర్ ఎంత పెరిగిందో తెలుస్తుంది. తక్కువ ఇండెక్స్ ఉంటే ఆ పండులో తక్కువ స్థాయిలో చక్కెర, ఎక్కువ ఫైబర్ ఉన్నట్లుగా చెబుతారు.

Also Read: నీళ్లు తక్కువగా తాగేవారికి షాకింగ్ న్యూస్.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

Potato Peel: ఆలు తొక్కలను బయట పడేస్తున్నారా ? ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..