నీళ్లు తక్కువగా తాగేవారికి షాకింగ్ న్యూస్.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరు రోజుకూ 8 గ్లాసుల నీరు తాగాలంటారు. అలాగే రోజులో దాదాపు 4 లీటర్ల నీరు

నీళ్లు తక్కువగా తాగేవారికి షాకింగ్ న్యూస్.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Water
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 7:08 PM

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరు రోజుకూ 8 గ్లాసుల నీరు తాగాలంటారు. అలాగే రోజులో దాదాపు 4 లీటర్ల నీరు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే తొందరగా అలసటకు గురవుతుంటారు. ఎక్కువగా నీరు తాగేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారట. అయితే కొందరు రోజులో తక్కువగా నీరు తాగుతుంటారు. మరికొందరు మాత్రం భోజన సమయంలో మినహా. ఇక నీళ్లు అస్సలు ముట్టుకోరు.. నీళ్లు తాగని వారిలో డీహైడ్రేషన్ సమస్యతోపాటు.. నిద్రపై ప్రభావం చూపిస్తుందట. సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ అంటున్నారు నిపుణులు.

ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తక్కువ నిద్రకు కారణం డీహైడ్రేషన్ అని వెల్లడైంది. అంతేకాకుండా..డీహైడ్రేషన్ సమస్యను సూచించే కొన్ని లక్షణాలను కూడా గుర్తించారు నిపుణులు. నీరు తక్కువగా తీసుకునేవారికి కండరాల తిమ్మిరికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సరైన నిద్ర ఉండదు. కొన్నిసార్లు రాత్రిళ్లు వ్యక్తి మేల్కోని ఉంటాడు. కండరాలలో దాదాపు 76 శాతం నీరు ఉంటుంది. అందుకే నీరు తక్కువగా తీసుకునేవారిలో కండరాల సమస్యలు మొదలవుతాయి. అలాగే కండరాలు తీవ్ర నొప్పి కలుగుతుంది. కాళ్లు లాగడం.. పాదాలలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీంతోపాటు కండరాలు బిగుసుకుపోయినట్లుగా ఉంటుంది. దీంతో రాత్రంతా వారు నిద్రపోలేదు. నీరు తక్కువగా తాగేవారిలో మైగ్రేన్ సమస్య వస్తుంది. ఇది కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. డీహైడ్రేషన్ వలన నాలుక పొడిబారినట్లుగా ఉంటుంది. అలాగే వీరికి సరిగ్గా నిద్ర పట్టదు. అర్ధరాత్రిళ్లు నిద్రలేకుండా ఉంటారు.

Also Read: Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..

SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌…

Preity Zinta: కవలలను ఆహ్వానించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ను పంచుకున్న సొట్టబుగ్గల సుందరి..