SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌…

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న..

SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌...
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2021 | 2:05 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియా శరన్‌ తదితర ప్రముఖులు ఈ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే భారీ హంగులు, సెట్టింగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్‌లు, లిరికల్‌ వీడియోలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో 50 రోజుల్లో మీ ముందుకు… కాగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్రబృందం బృందం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. 2017లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయాన్ని ఇద్దరు హీరోలతో సరదాగా కలిసి ఉన్న ఫొటో ద్వారా ప్రకటించారు రాజమౌళి. ఇప్పుడు ఇదే ఫొటోను ట్యాగ్ చేస్తూ ‘ నాలుగేళ్ల క్రితం ఈ ఫొటోను షేర్‌ చేసి అభిమానుల్లో ఎన్నో అంచనాలు రేకెత్తించాం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలు పెట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. మరో 50 రోజుల్లో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్‌ బ్లాస్ట్‌’ అని చిత్రబృందం రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

Preity Zinta: కవలలను ఆహ్వానించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ను పంచుకున్న సొట్టబుగ్గల సుందరి..

EMK 1 Crore Winner Raja Ravindra Interview: గెలుచుకున్న కోటి ఎం చేస్తానంటే..చరిత్ర సృష్టించిన రాజా రవీంద్ర మాటల్లో..(వీడియో)

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!