Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది

Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..
Sneha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 6:36 PM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది స్నేహ. గ్లామరస్ పాత్రకు అమడ దూరంలో ఉంటూ… కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలంపాట్ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. వరుస చిత్రాలతో అగ్రకథనాయికలలో ఒకరిగా దూసుకుపోతున్న సమయంలోనే స్నేహ.. తన స్నేహితుడు… నటుడు ప్రసన్నను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే స్నేహ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వదినా.. అక్క పాత్రలు చేస్తూ మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకలను మెప్పించింది స్నేహ..

ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహ.. తనకు మోసం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యాపారవేత్తలపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఎక్స్ పోర్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యాపారవేత్తల కంపెనీలో స్నేహ చాలా రోజులుగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిందట. అయితే ఇప్పటివరకు స్నేహా చెల్లించిన డబ్బుకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదని.. వారికి స్నేహా దాదాపు రూ. 26 లక్షలు ఇచ్చిందట. ఇప్పటివరకు ఈ డబ్బులపై ఒక్క రూపాయి కూడా తనకు రిటర్న్స్ రూపంలో చెల్లించలేదని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం. అందుకు వడ్డీ చెల్లించమని అడిగినందకు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా స్నేహా తన ఫిర్యాదులో పేర్కోంది. పోలీసులు తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని స్నేహా కోరినట్లుగా సమాచారం.

Also Read: Pushpa: పుష్ప తమిళ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న లైకా.. పుష్పరాజ్ మూవీకి ఎన్ని కోట్లంటే..

Amala Paul: భారీ ప్రాజెక్ట్‏ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..

Samantha: ఆమె కలలు కన్నది.. ధైర్యం చేసింది.. నయన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..