Amala Paul: భారీ ప్రాజెక్ట్‏ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ సమస్యలు ఎక్కువయినట్లుగా తెలుస్తోంది. తమ ఇమేజ్‏కు.. స్టోరీకి తగిన హీరోయిన్స్

Amala Paul: భారీ ప్రాజెక్ట్‏ను మిస్ చేసుకున్న అమలాపాల్ ? .. కారణమేంటంటే..
Amala Paul
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 5:24 PM

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్స్ సమస్యలు ఎక్కువయినట్లుగా తెలుస్తోంది. తమ ఇమేజ్‏కు.. స్టోరీకి తగిన హీరోయిన్స్ అస్సలు దొరకడం లేదట. దీంతో స్టార్ హీరోల సినిమాల కోసం ముందుగానే హీరోయిన్స్‏ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్. కొత్త తరం నటీమణులు ఎవరు మన సీనియర్స్ హీరో ఇమేజ్‏కు సెట్ కాకపోవడం.. అలాగే వయసులో చిన్నవారు కావడం కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇటీవల బాలయ్య సినిమాకు అదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టా్ర్ హీరోకు కూడా ఇలాంటి సమస్యే వచ్చి పడిందట.

అక్కినేని నాగార్జున.. ఇప్పటి యంగ్ హీరోస్‏కు ఏమాత్రం తగ్గకుండా.. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. నవతరం దర్శకులకు ఛాన్స్ ఇస్తూ మూవీస్ చేస్తున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ హీరోయిన్‏గా నటిస్తుంది. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడం.. అలాగే తన పర్సనల్ కారణాల వలన ఈ సినిమా నుంచి తప్పుకుంది కాజల్. దీంతో ఘోస్ట్ మూవీ కోసం హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో నాగార్జున పాత్రకు తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర ఉండడంతో అందుకు తగినట్టుగానే కథనాయికను ఎంపిక చేయాలనుకుంటున్నారట. ఈ క్రమంలో అమలాపాల్ పేరును సెలక్ట్ చేశారట. ఈ విషయమై అమలాపాల్ ను సంప్రదించగా.. ఆమె కోటీ రూపాయాలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఇప్పటికే ఫాంలో లేని అమలాపాల్ అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేసినట్లుగా టాక్. ఇక ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండడంతో నాగ్ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నారట. మరీ చూడాలి.. నాగార్జున సరసన ఏ హీరోయిన్ నటించనుందో. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్.

Also Read: Samantha: ఆమె కలలు కన్నది.. ధైర్యం చేసింది.. నయన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!