Samantha: ఆమె కలలు కన్నది.. ధైర్యం చేసింది.. నయన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

అందం, అభినయంతో సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది నయనతార. దక్షిణాది

Samantha: ఆమె కలలు కన్నది.. ధైర్యం చేసింది.. నయన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 5:04 PM

అందం, అభినయంతో సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది నయనతార. దక్షిణాది చిత్రపరిశ్రమలో హీరోలకు ఏమాత్రం తీసుకుపోకుండా.. సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయన్ మాత్రమే. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే కాకుండా.. పాత్రకు కూడా సరైన ఇంపార్టెన్స్ ఉండే సినిమాలను ఎంచుకుంటుంది నయన్. ఈ రోజూ లేడీ సూపర్ స్టార్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా నయనతారకు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, హీరోహీరోయిన్లు నయన్‍కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు నయన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఇచ్చిన స్పెషల్ సర్ ప్రైజ్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా నయన్‏కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం వీరిద్దరు ప్రధాన పాత్రలలో కాతు వాకులం రెండు కాదల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నయన్ బర్త్ డే వేడుకలలో సామ్ పాల్గోంది. లేడీ సూపర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. నయన్ పై ఆసక్తికర కోట్స్ పోస్ట్ చేసింది. “ఆమె వచ్చింది.. ఆమె ఎన్నో చూసింది.. ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కన్నది.. ఆమె నటించింది.. ఆమె సాదించింది.. హ్యాప్పీ బర్త్ డే నయన్.. క్వీన్..” అంటూ #KaathuVaakulaRenduKaadhal హ్యాష్ ట్యాగులతో పోస్ట్ చేసింది. ఇక సామ్.. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది సామ్.

Also Read: Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది