Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా

Nayanthara: నయన్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. చిరు సినిమాలో లేడీ సూపర్ స్టార్ ఫిక్స్..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2021 | 3:02 PM

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు చిరు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. పూజాహెగ్డే, రామ్ చరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమాలో నయనతార నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ రూమర్స్‏కు చెక్ పెట్టారు గాడ్ ఫాదర్ మేకర్స్. ఈరోజు నయన్ పుట్టిన రోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడున్న నటీమణులలో హీరోలతో సరిసమానంగా అత్యంత పారితోషికం అందుకున్న హీరోయిన్ నయన్. ఇప్పటికే చిరు సరసన సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటించి మెప్పించింది నయన్.

Also Read: SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌…

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..

Bigg Boss 5 Telugu: ప్రేమ నిండిన అక్షరాలతో హమీదాకు శ్రీరామచంద్ర లేఖ.. సుమ రాయభారం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!