AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ప్రేమ నిండిన అక్షరాలతో హమీదాకు శ్రీరామచంద్ర లేఖ.. సుమ రాయభారం..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో గొడవలు, ఏడుపులకు ఎంత పెట్టింది పేరో.. మనుషుల మధ్య బంధానికి కూడా అంతే పెట్టింది పేరు. ఒకే ఇంట్లో మరో ప్రపంచం లేకుండా గడిపే హౌజ్‌మేట్స్‌ మధ్య కేవలం..

Bigg Boss 5 Telugu: ప్రేమ నిండిన అక్షరాలతో హమీదాకు శ్రీరామచంద్ర లేఖ.. సుమ రాయభారం..
Biggboss 5 Telugu
Narender Vaitla
|

Updated on: Nov 18, 2021 | 12:22 PM

Share

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో గొడవలు, ఏడుపులకు ఎంత పెట్టింది పేరో.. మనుషుల మధ్య బంధానికి కూడా అంతే పెట్టింది పేరు. ఒకే ఇంట్లో మరో ప్రపంచం లేకుండా గడిపే హౌజ్‌మేట్స్‌ మధ్య కేవలం శత్రుత్వమే కాదు ప్రేమలు, స్నేహాలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లు అన్నింటిలో ఎంతో మంది జంటల మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా ప్రసారమవుతోన్న 5వ ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఓ బంధానికి బీజం పడింది. ఆ జంటే హమీదా, శ్రీరామ చంద్ర. బిగ్‌బాస్‌ హౌజ్‌లో వీరిద్దరి మధ్య నడిచిన లవ్‌ ట్రాక్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా వీరి మధ్య మంచి స్నేహం చిగురించింది. అయితే శ్రీరామ చంద్ర ఇంకా హౌజ్‌లోనే ఉండగా.. హమీదా మాత్రం ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీరామ చంద్ర, హమీదాల మధ్య యాంకర్‌ సుమ రాయభారాన్ని నడిపించారు. శ్రీరామరచంద్ర ప్రేమ లేఖ రాశాడు అంటూ హమీదాకు ఓ లెటర్‌ను చదివి వినిపించారు. ఇటీవల స్టార్‌ మాలో ప్రసారమైన ‘స్టార్‌ మ్యూజిక్‌’లో హమీదా అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ.. హమీదాకు శ్రీరామ చంద్ర రాసిన ప్రేమ లేఖను చదివి వినిపించారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘నా కనులు కలే కల నువ్వు. నీ లేత నవ్వులో ఉన్న వెచ్చదనం, నీ మాటలో ఉన్న చల్లదనం, ప్రతీ క్షణం నాకు గుర్తొస్తున్నాయి. నీ జ్ఞాపకాలు నన్ను నడిపిస్తున్నాయి. ఐ మిస్‌ యూ సోమచ్‌’ అని శ్రీరామ చంద్ర రాసుకొచ్చినట్లు సుమ తెలిపారు.

దీంతో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయిన హమీదా.. గాల్లో హార్ట్‌ షేప్‌ను చూపిస్తూ.. ‘రామ్‌ నువ్వు గెలిచి వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నా అనంతమైన ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Also Read: CLAT Exam: లా విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఏటా రెండుసార్లు క్లాట్‌.. కౌన్సెలింగ్‌ ఫీజు కూడా తగ్గింపు..

Nayantara Birthday: ప్రియురాలి పుట్టిన రోజు కోసం విఘ్నేష్‌ గ్రాండ్‌ పార్టీ .. హాజరైన సామ్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌..

CM KCR Maha Dharna Live: ఈ యుద్ధం అంతం కాదు.. ఆరంభం. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆగదు: కేసీఆర్