AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Food: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. సీజనల్ వ్యాధులను తగ్గించే ఆహారపదార్థాలు ఇవే..

వర్షాకాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. జ్వరం, ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రస్తుతం కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు

Monsoon Food: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. సీజనల్ వ్యాధులను తగ్గించే ఆహారపదార్థాలు ఇవే..
Immunity Food
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2021 | 3:29 PM

Share

వర్షాకాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. జ్వరం, ఇన్ఫెక్షన్ల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రస్తుతం కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు రోగ నిరోధక శక్తి తప్పనిసరి. అలాగే ఇతర అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కూడా ముఖ్యమే. వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే రోజు తీసుకునే ఆహార పదార్థాలతోపాటు.. మరిన్ని జత చేసుకుంటే .. సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. మరి అవెంటో తెలుసుకుందామా.

పుచ్చకాయ.. సాధారణంగా పుచ్చకాయ ఎండాకాలంలో ఎక్కువగా విరివిగా దొరుకుతుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వలన హైడ్రేటింగ్ గా ఉండేలా చేస్తుంది. ఇందులో గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

బ్రోకలీ.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిని రోజూవారీ డైట్ లో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బచ్చలి కూర.. ఇందులో విటమిన్ సి, ఇ ఎక్కువగా ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక రకాల పోషకాలు నిండి ఉండడం వలన బచ్చలి కూరను ఎక్కువగా తీసుకోవడం వలన సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

బీట్‏రూట్.. సాధారణంగా బీట్‏రూట్ శరీరంలో రక్తాన్ని పెంచుతుందని అంటుంటారు. కేవలం హిమోగ్లోబిన్ పెంచడమే కాదండోయ్.. బీట్‏రూట్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో పొటాషియం, ఇతర ఖనిజాల వంటి పోషకాలు అనేకం. ఇది రక్తపోటును తగ్గించడమే కాదు.. ఆరోగ్యమైన బరువును నిర్వహిస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. దీనిని రోజూ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతంది.

నారింజ.. ఇది ఎక్కుగా ఆమ్లత్వం కలిగి పదార్థం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఐరన్ లోపం.. రక్తహీనతతో బాధపడేవారికి ఇది సూపర్ బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు.

పెరుగు.. పెరుగు రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ జలుబు తీవ్రతను తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

పుట్టగొడుగులు.. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు.. వీటిని రోజూవారీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా… క్యాన్సర్, గుండె జబ్బును తగ్గిస్తుంది.

Also Read: VIRAL PHOTOS : ఈ 5 ప్రదేశాల్లో గురత్వాకర్షణ శక్తి పనిచేయదు..! ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసా..?

Cinematograph Act: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రగడ.. అసలు యాక్ట్‌లో ఏముంది.. కేంద్రం ఏం తెస్తోంది. .?

High Court: సమయానికి రాని అంబులెన్స్.. వైద్యం అందక బాలింత మృతి.. పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం!